స్టాన్చార్ట్తో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఒప్పందం

స్టాన్చార్ట్తో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఒప్పందం

హైదరాబాద్​, వెలుగు: దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి కోసం స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ తమ భాగస్వామ్యాన్ని పొడిగించాయి. తెలంగాణ, మహారాష్ట్ర,  ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలలో ఈ కార్యక్రమం అమలు కానుంది. దీని ద్వారా 2028 మార్చి నాటికి 1,250 మంది వికలాంగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తారు. వినికిడి లోపం, మరుగుజ్జుతనం, కాళ్ల సమస్యలు ఉన్నవారికి ఈ నైపుణ్య శిక్షణ అందిస్తారు.

2023 నవంబర్ లో ప్రారంభమైన ఈ ప్రయాణంలో ఇప్పటివరకు మూడు వేల మందికిపైగా శిక్షణ ఇచ్చి 70 శాతం మందికి ఉద్యోగాలు కల్పించారు. ఈ ఏడాది జనవరిలో స్వయం ఉపాధి కోసం 1,900 మందికి ఆర్థిక సహాయం అందించారు. మొత్తం ఆరు వేలకు పైగా యువత , దివ్యాంగులకు లబ్ధి చేకూర్చడమే ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యమని సంస్థల ప్రతినిధులు తెలిపారు.