2028లో బజాజ్ ఎలక్ట్రిక్ టూ వీలర్

2028లో బజాజ్ ఎలక్ట్రిక్ టూ వీలర్

న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌‌‌‌ను అభివృద్ధి చేస్తోంది.  2028 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. తొలుత అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేశాక, భారత్‌‌‌‌లో ప్రవేశపెట్టనుంది.

కంపెనీ ఎలక్ట్రిక్ వాహన వ్యాపారం మంచి వృద్ధిని సాధిస్తోందని సీఎఫ్‌‌‌‌వో దినేష్ థాపర్ తెలిపారు. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రికార్డు స్థాయి అమ్మకాలను సాధించింది. ఈ క్వార్టర్​లో 1.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేశారు.

చేతక్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 50వేల యూనిట్ల నుంచి 60వేల యూనిట్లకు పెంచాలని నిర్ణయించారు. దేశీయ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మార్కెట్లోనూ బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొత్తం తయారీ సామర్థ్యాన్ని 20 శాతం పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

బజాజ్​ఆటోకు జూన్ క్వార్టర్లో నికర లాభం 42 శాతం పెరిగి రూ.2,983 కోట్లకు చేరింది. ఆదాయం 37 శాతం ఎగబాకి రూ.17,244 కోట్లుగా రికార్డయింది.