చెన్నై: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. మంగళవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో అర్జున్ 60 ఎత్తుల వద్ద నీహల్ సరీన్ చేతిలో ఓడాడు.
తాజా ఓటమితో అర్జున్ మూడున్నర పాయింట్లతో సంయుక్తంగా రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. మరో గేమ్‌లో ఎం. ప్రణేశ్.. వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్‌పై సంచలన విజయం సాధించాడు.
