హైదరాబాద్, వెలుగు: పుల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (పీఐపీ) హైదరాబాద్కు చెందిన హెల్త్కేర్ప్రొవైడర్ సింధు హాస్పిటల్స్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా డీ ఫార్మసీ చదివే విద్యార్థులకు ఆసుపత్రి వాతావరణంలో ప్రత్యక్ష క్లినికల్ శిక్షణ ఇస్తారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, ప్రసూతి, సైకియాట్రిక్స్, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి విభాగాలకు చెందిన నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతారు.
ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 1,500 పడకల సంస్థ సింధు హాస్పిటల్స్ను ప్రారంభించారు. ఆధునిక వైద్య సాంకేతికతను ప్రజలకు అందించడంలో ఈ క్వాటర్నరీ కేర్ కేంద్రం ముందుంటుంది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా పదేళ్ల కాలానికి ఈ ఒప్పందం కుదిరిందని సింధు హాస్పిటల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.
