సీఎం సినిమా థియేటర్‌‌‌‌‌‌‌‌లో రావడం అరుదు

సీఎం సినిమా  థియేటర్‌‌‌‌‌‌‌‌లో రావడం అరుదు

 ‘జన నాయకుడు ’ చిత్రం తమిళనాడు సీఎం విజయ్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అవుతుందని నిర్మాత వెంకట్ కె నారాయణ అన్నారు.  విజయ్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన   సినిమా వాస్తవానికి ఈ ఏడాది పొంగల్‌‌‌‌‌‌‌‌కు విడుదల కావాల్సి ఉంది. అయితే  సెన్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవాంతరాలు, కోర్టు కేసులతో వాయిదా పడి ఎట్టకేలకు జులై 23న ప్రేక్షకుల ముందుకుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత కేవీఎన్ చెప్పిన విశేషాలు. 

‘‘ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు రావొచ్చని మేం ముందే ఊహించాం.   విజయ్ గారు కూడా, ‘ఇది నా చివరి సినిమా. దీని తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్తున్నాను.  అందువల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది’  అని ముందే చెప్పారు. అయితే రిలీజ్ సమయంలో థియేటర్స్ విషయంలో కొన్ని అడ్డంకులు రావచ్చని మాత్రమే భావించాం. కానీ మేము ఊహించని కొన్ని పరిస్థితులు వచ్చాయి.

ఫైనల్‌‌‌‌‌‌‌‌గా ఇప్పుడు విడుదలవుతోంది.  కాకపోతే ఇందులో మంచిని కూడా చూడాలంటే విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా వస్తోంది. అది అభిమానులకు మరింత ఉత్సాహం ఇస్తుంది.  ఇది నా తొలి తమిళ సినిమా. విజయ్ గారి మేనేజర్‌‌‌‌‌‌‌‌తో నాకు ముందే పరిచయం ఉంది. 'లియో' సినిమా సమయంలో మా మధ్య చర్చలు జరిగాయి.  ఒక్క మీటింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఈ సినిమా ఓకే అయింది.  'భగవంత్ కేసరి' సినిమా నాకు, విజయ్ గారికి  ఇష్టం.  అందులోని రెండు సన్నివేశాలను మాత్రమే ఇన్‌‌‌‌‌‌‌‌స్పిరేషన్‌‌‌‌‌‌‌‌గా తీసుకుని, మిగతా కథ మొత్తం కొత్త ప్రపంచంలో సాగేలా రూపొందించాం.

ఈ విషయంపై అనిల్ గారితో కూడా మాట్లాడాం. పూర్తిగా కొత్త సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పని చేశాం. ఇందులో గర్ల్ చైల్డ్ ఎంపవర్‌‌‌‌‌‌‌‌మెంట్, సమాజంలో మార్పు తీసుకురావాలనే సందేశం ఉంది. యువతను ప్రేరేపించేలా, ఆలోచింపజేసేలా ఉంటుంది.  ఈ తరం ప్రేక్షకులకు ఒక ముఖ్యమంత్రి నటించిన సినిమాను థియేటర్‌‌‌‌‌‌‌‌లో చూసే అవకాశం రావడం చాలా అరుదు. కచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికీ మెమొరబుల్ మూమెంట్ అవుతుంది.  ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 స్ర్కీన్స్‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’.