PLIతో రూ.2.40 లక్షల కోట్ల పెట్టుబడులు.. 14.15 లక్షల మందికి ఉపాధి

PLIతో రూ.2.40 లక్షల కోట్ల పెట్టుబడులు.. 14.15 లక్షల మందికి ఉపాధి
  • సోలార్ మాడ్యూల్స్​ కోసం రూ.64,873 కోట్ల పెట్టుబడులు
  • 14.15 లక్షల మందికి ఉపాధి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రొడక్షన్​ లింక్​డ్​ఇన్సెంటివ్స్​( పీఎల్ఐ) పథకాలు దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి వీటి ద్వారా రూ.2.40 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. ఫలితంగా 14.15 లక్షల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందారు.

ఎగుమతులు కూడా రూ.15.2 లక్షల కోట్లకు చేరాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. సోలార్ పీవీ మాడ్యూల్స్ రంగానికి అత్యధికంగా రూ.64,873 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫార్మాస్యూటికల్స్ రంగంలో రూ.45,158 కోట్లు, ఆటోమొబైల్ రంగంలో రూ.44,326 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం కింద 219 ఇంక్యుబేటర్లను ఎంపిక చేశారు. రూ.945 కోట్ల నిధులకు ఆమోదం తెలపగా, రూ.650 కోట్లను విడుదల చేశారు. భారత్ కంపెనీలు అమెరికాలో 2021 నుంచి 2026 మధ్య 15.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,53,037 కోట్లు) పెట్టుబడి పెట్టాయి.

సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌‌‌‌డీఐ) ప్రవాహం తగ్గింది. సింగిల్ బ్రాండ్ రిటైల్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 1.53 బిలియన్ డాలర్లకు చేరాయి. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం వివిధ రంగాలలో ప్రత్యేక రాయితీలను అందిస్తున్నదని జితిన్​ప్రసాద వివరించారు.