పేటీఎం లాభం రూ.220 కోట్లు.. రికార్డు స్థాయిలో ఇబిటా

పేటీఎం లాభం రూ.220 కోట్లు.. రికార్డు స్థాయిలో ఇబిటా

హైదరాబాద్​, వెలుగు: డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్​ క్వార్టర్లో సత్తా చాటింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ.203 కోట్ల క్వార్టర్లీ ఇబిటాను  సాధించింది. ఆపరేటింగ్ ఆదాయం 28 శాతం పెరిగి రూ.2,448 కోట్లకు చేరింది.

పన్ను తర్వాత లాభం 79 శాతం ఎగబాకి రూ.220 కోట్లకు చేరుకుంది. వ్యాపార వృద్ధి, మార్జిన్ విస్తరణ కారణంగా ఈ రికార్డు సాధ్యమైంది. మర్చంట్ జీఎంవీ వృద్ధి 31 శాతం పెరిగి రూ.7.1 లక్షల కోట్లకు చేరింది.

ఆర్థిక సేవల పంపిణీ ఆదాయం 45 శాతం వృద్ధితో రూ.814 కోట్లకు పెరిగింది.  యూపీఐ జీటీవీ 45 శాతం పెరిగి రూ.5.9 లక్షల కోట్లకు చేరింది. నెలవారీ లావాదేవీలు నిర్వహించే వినియోగదారుల సంఖ్య ఎనిమిది కోట్లకు పెరిగింది. గత నెల నాటికి కంపెనీ నగదు నిల్వలు రూ.13,529 కోట్లకు చేరాయి.