ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ.. త్వరలో మరిన్ని అరెస్టులు

ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ.. త్వరలో మరిన్ని అరెస్టులు

ఐబొమ్మ రవి కస్టడీ విచారణ ఇవాళ్టితో (డిసెంబర్ 29) ముగిసింది. 12రోజుల కస్టడీ ముగియటంతో.. రవినుండి కీలక సమాచారం సేకరించారు  పోలీసులు . రవిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అనంతరం నాంపల్లి కోర్టులో హజరుపరిచారు.

ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రహ్లాద్‌ అనే వ్యక్తి డాక్యుమెంట్లు ఇమ్మడి రవి దొంగలించినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రహ్లాద్‌ వెల్లేల పేరిట పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు గుర్తించారు. ప్రహ్లాద్‌ తన రూమ్‌మేట్‌ అని గతంలో పోలీసులకు చెప్పాడున రవి 

దీంతో బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించి విచారణ చేపట్టారు పోలీసులు.  కస్టడీలో ఉన్న ఇమ్మడి రవి ఎదుటే... ప్రహ్లాద్‌ను విచారించారు.  ఈ సందర్భంగా రవి ఎవరో తనకు తెలీదని పోలీసులకు చెప్పాడు ప్రహ్లాద్ . తన పేరుతో రవి పాన్‌, లైసెన్స్‌ తీసుకున్నట్లు తెలిసి షాక్‌కు గురయ్యానని ప్రహ్లాద్ చెప్పాడు. 

►ALSO READ | PEDDI: అసలు ఇతను జగ్గూభాయేనా? ‘పెద్ది’లో అప్పలసూరిగా షాకింగ్ మేకోవర్!

రవి కస్టడీలో బ్యాంక్ ట్రాన్సక్షన్ ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు పలీసులు. లక్షల్లో లావాదేవీలు, డొమైన్ కొనుగోలు, ఐపి మాస్క్ ఎలా చేస్తున్నావ్.., సర్వర్ లోడ్ కెపాసిటీ ఎంత వెచ్చిస్తున్నావ్.. ఎవరెవరు సర్వర్ మైంటైన్ చేస్తున్నారు.. అంటూ దాదపు అన్నిప్రశ్నలు కురిపించారు పోలీసులు.ఈ కేసులో త్వరలోనే ఫైరసి రాకెట్ లో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు.