గ్యాస్ కొరత..పార్లమెంట్ ముందు ఎంపీ వంశీ నిరసన

గ్యాస్ కొరత..పార్లమెంట్ ముందు ఎంపీ వంశీ నిరసన

పార్లమెంట్ ముందు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ నిరసనకు దిగారు.  దేశంలో ఎల్పీజీ కొరతను నిరసనగా పార్లమెంట్ ముఖద్వారం ముందు మెట్లపై ఫ్లెక్సీతో బైటాయించారు. ప్రధాని కాంప్రమైజ్ అయ్యారనే ఫ్లెక్సీతో వంశీకృష్ణ ప్రొటెస్ట్ చేశారు.  నాలుగు రోజుల క్రితం దేశంలో గ్యాస్ కొరత లేదన్న కేంద్రం..ఇపుడెందుకు సరఫరా చేయట్లేదని ప్రశ్నించారు.  వెంటనే కావాల్సినంత గ్యాస్ ను కేంద్రం సప్లై చేయాలని డిమాండ్ చేశారు.

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంధన కొరత నెలకొన్నది. హార్మూజ్​ జలసంధి నుంచి ముడి చమురు నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో దేశంలోని  ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. 

దేశంలో చమురు, గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం ప్రకటనలు చేస్తున్నా.. వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ముంబైలో ఇప్పటికే 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేసినట్టు హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది.  దాదర్, అంధేరి, మటుంగాలాంటి ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లు గ్యాస్ ఆదా చేయడానికి ఎక్కువ సమయం పట్టే దాల్​ మఖానీ, రవ్వ దోశలాంటి వంటకాలను మెనూ నుంచి తొలగించాయి. పని వేళలను కూడా తగ్గించుకున్నాయి. బెంగళూరు, చెన్నైలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో  మంగళవారం  నుంచి నగరంలో హోటల్స్​  కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉందని  బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.