మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ మంగళవారం సాంకేతిక సమస్యల వల్ల నిలిచిపోయింది. దింతో ప్రపంచవ్యాప్తంగా వేల మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ టెక్నికల్ సమస్య అమెరికా యూజర్లకు ఎక్కువగా ఎదురుకాగా.... డౌన్‌డెటెక్టర్ ప్రకారం, అమెరికాలో దాదాపు 10 వేల 725 మందికి పైగా సమస్య పై రిపోర్ట్ చేశారు. భారత్‌లో కూడా కొంతమందికి ఈ సమస్యలు ఎదురైనప్పటికీ, ఇక్కడ చాల తక్కువగా ఫిర్యాదు చేసారు. బ్రిటన్‌లోనూ వందల మంది ఇన్‌స్టాగ్రామ్ పనిచేయడం లేదని రిపోర్ట్ చేసారు.
యూజర్లకు ఎదురైనా సమస్యలు:
ప్రాంతాల వారీగా చూస్తే యూజర్లు వేర్వేరు సమస్యలను ఎదుర్కొన్నారు.
ఇండియాలో సుమారు 77 శాతం మందికి యాప్ అస్సలు ఓపెన్ కాలేదని. మరికొందరికి వెబ్‌సైట్, సర్వర్ కనెక్షన్ సమస్యలు వచ్చాయి అని చెప్పారు.
అమెరికాలో కూడా ప్రజలు ఎక్కువగా యాప్ సరిగ్గా పనిచేయలేదని... కొందరికి ఫోటోలు, వీడియోలు అప్‌డేట్ కావట్లేదని అన్నారు.
బ్రిటన్‌లో యాప్ ఓపెన్ కాకపోవడంతో పాటు, కొత్త కంటెంట్ పోస్ట్ చేయడం లేదా పబ్లిష్ చేయడంలో చాలామంది ఇబ్బందులు పడ్డారు.
అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్, చికాగో, బోస్టన్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి పెద్ద నగరాల్లో ఈ సమస్య ప్రభావం ఎక్కువగా కనిపించింది.
ఈ సాంకేతిక సమస్య పై మెటా కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సమస్య ఎందుకు వచ్చింది ? ఎప్పుడు పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతుంది ? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా ఇన్‌స్టాగ్రామ్ బాగానే పనిచేస్తున్న.. హఠాత్తుగా ఇలాంటి సమస్య రావడం యూజర్లను నిరాశకు గురిచేసింది.
