Babar Azam: పాక్ మాజీ కెప్టెన్‌కు ఘోర అవమానం.. క్రికెట్కి దూరంగా ఉండాలని బాబర్ నిర్ణయం

Babar Azam: పాక్ మాజీ కెప్టెన్‌కు ఘోర అవమానం.. క్రికెట్కి దూరంగా ఉండాలని బాబర్ నిర్ణయం

Babar Azam: టీ20 వరల్డ్ కప్-2026లో ఘోర ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠిన ఆంక్షలు చేపట్టింది. అందులో భాగంగా బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కి మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను సెలెక్టర్లు తీసివేశారు. వన్డే టీమ్ లో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న బాబర్‌ను తప్పించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. క్రికెట్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. 2027 వన్డే వరల్డ్ కప్‌లో బాబర్ ఆడటం కష్టం అయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో అతడు నిరాశాజనక ప్రదర్శన కనబరిచాడు. టీమ్ మేనేజ్‌మెంట్ ఆజం బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చినప్పటికీ ఫలితం దక్కలేదు. 

దీంతోబాబర్ ఆజం 4 ఇన్నింగ్స్‌లో సగటు 22.75తో కేవలం 91 రన్స్ మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా పాక్ క్రికెట్ బోర్డు (PCB) సెలెక్షన్ కమిటీ అతడిపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక జట్టు నుంచి విడివడి ఉన్న బాబర్, ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ టీ20 జట్టు నుంచి తప్పుకున్నాడు. కొంతకాలం పాటు క్రికెట్ నుంచి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. అతను తన బ్యాటింగ్ టెక్నిక్ లోపాలను సరిచేసుకోవడానికే ఈ విరామాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. 

ఇక పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ప్రస్తుతం నెట్ సెస్‌లో కఠినంగా శ్రమిస్తున్నప్పటికీ, తన ఫామ్‌ని తిరిగి పొందడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. అతడిని తిరిగి పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్‌లో చూసే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్లో పెషావర్ జల్మీ కెప్టెన్‌గా బాబర్ వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది PSL మార్చి 28వ తేదీన ప్రారంభం కానుంది.