ముప్పై నిమిషాల పని కాస్తా.. ఇప్పుడు రెండు గంటలు పడుతోంది.. ఏఐతో వింత అనుభవం !

 ముప్పై నిమిషాల పని కాస్తా.. ఇప్పుడు రెండు గంటలు  పడుతోంది.. ఏఐతో వింత అనుభవం !

ముంబైకి చెందిన Msquare Labs వ్యవస్థాపకుడు ముస్తఫా యూసుఫ్ Xలో AI గురించి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. AI వల్ల  పనిలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఆయన రెండు రకాలుగా వివరించారు.  గతంలో రెండు గంటలు పట్టే కొన్ని పనులు, ఇప్పుడు AI సాయంతో కేవలం 30 నిమిషాల్లోనే పూర్తవుతున్నాయి. విచిత్రంగా గతంలో 30 నిమిషాల్లో అయిపోయే పనులు, ఇప్పుడు AI వాడటం వల్ల ఏకంగా రెండు గంటలు పడుతుంది,

ఎందుకు ఇలా :
ఈ పోస్ట్‌పై స్పందించిన చాలామంది నెటిజన్లు  మేము కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. దానికి కారణాలు చూస్తే... ఒక చిన్న పనిని మనమే చేసే బదులు, అది ఎలా చేయాలో AIకి వివరించడానికి (ప్రాంప్ట్ ఇవ్వడానికి) ఎక్కువ సమయం పడుతోంది. ఒక్కోసారి AI ఇచ్చే రిజల్ట్ సరిగ్గా లేక దానితో వాదించాల్స వస్తోంది.

 పని ఏంటో క్లియర్ గా తెలిస్తే AI బాగా పనిచేస్తుంది. కానీ పనిలో గందరగోళం ఉన్నప్పుడు, AI కంటే మనమే సొంతంగా ఆలోచించి చేయడం వేగంగా అయిపోతుంది. ఇప్పుడు కోడింగ్ రాయడం కంటే, AIకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, అది ఇచ్చిన కోడ్‌ను చెక్ చేయడానికే ఎక్కువ టైమ్ పడుతోంది.

 AI వల్ల కొన్ని పనులు చాలా ఈజీ అయ్యాయి, కానీ మరికొన్ని పనుల విషయంలో మాత్రం అది సమయాన్ని వృధా చేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద చూస్తే AI వల్ల లాభం ఉన్న.. ఏ పనికి AI వాడాలో, ఏది సొంతంగా చేసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యమని అని  చర్చలు చేస్తున్నారు.