Virat Kohli: ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త..  ఐపీఎల్ కోసం ప్రాక్టీస్‌ షూరు చేసిన కింగ్ కోహ్లీ..

Virat Kohli: ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త..  ఐపీఎల్ కోసం ప్రాక్టీస్‌ షూరు చేసిన కింగ్ కోహ్లీ..

Virat Kohli: త్వరలో (మార్చ్ 28న) ప్రారంభం కానున్న ఐపీఎల్– 19వ సీజన్ కి ముందు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ అభిమానులకు అదిరిపోయే శుభవార్తను తెలియజేసింది. టీమిండియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ లీగ్ కోసం ప్రాక్టీస్ షూరు చేసిన వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీంతో యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)లోని శిక్షణ కేంద్రంలో నెట్ ప్రాక్టీస్‌ సందర్భంగా భారీ షాట్లు కొట్టుతూ ఉన్న వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసింది. వీడియోలో కోహ్లీ ఇన్‌డోర్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆయన పోస్ట్‌కు “IPL 2026” అని శీర్షిక పెట్టారు, అలాగే సాండ్‌గ్లాస్ ఎమోజీని కూడా జోడించారు.

RCB ఫ్రాంచైజీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ, “రన్ మిషన్ తగిన స్థాయిలో ఉంది.. IPL2026 మొదలుపెడదాం అని పేర్కొంది. అలాగే, కోహ్లీ 18 ఏళ్లుగా ఫ్రాంచైజీతో కొనసాగుతున్నందుకు ప్రత్యేకంగా ఎడిట్ చేసిన వీడియోను విడుదల చేశారు. ఈ సీజన్‌తో కోహ్లీ RCBతో తన 19వ ఐపీఎల్ సీజన్‌ని కొనసాగిస్తున్నాడు. విరాట్ 2025 సీజన్‌లో RCBకు టైటిల్ రావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సీజన్‌లో 15 ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేయడంతో పాటు 144.71 స్ట్రైక్ రేటుతో జట్టు టాప్ స్కోరర్‌గా కోహ్లీ నిలిచారు. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 రన్స్ తేడాతో బెంగుళూరు విజయం సాధించి 18 ఏళ్ల తర్వాత మొట్టమొదటి సారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 

అయితే టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుంచి విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన కేవలం ODI ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇక త్వరలో ప్రారంభమైయ్యే ఐపీఎల్ 2026 కోసం కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఆర్సీబీ అభిమానులకు కొత్త ఉత్సాహం తెస్తుంది RCB జట్టు తరపున వందలాది మ్యాచులు ఆడిన ‘రన్ మిషన్’ ఇప్పుడు మళ్ళీ అభిమానులను ఉత్సాహ పరిచేందుకు సిద్ధం అవుతున్నాడు.