‘ఇంకా ఏం అనుకోలేదు’.. వంశీ నందిపాటి నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదే

‘ఇంకా ఏం అనుకోలేదు’.. వంశీ నందిపాటి నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదే

నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌‌‌‌‌‌‌‌గా వరుస సక్సెస్‌‌‌‌లు అందుకుంటున్న వంశీ నందిపాటి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా వాటిలో ఓ చిత్రానికి సంబంధించి క్రేజీ టైటిల్‌‌‌‌ను మంగళవారం అనౌన్స్ చేశారు. ‘ఇంకా ఏం అనుకోలేదు’ అనే వెరైటీ టైటిల్‌‌‌‌తో ఈటీవీ విన్‌‌‌‌తో కలిసి తాను ఓ  సినిమా రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. 

ఇప్పటికే వీరి కాంబోలో పలు సూపర్ హిట్స్  రాగా ఈ మూవీపైనా ఆసక్తి నెలకొంది.  ఈ చిత్రానికి  రచయిత-దర్శకుల జోడీ ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని దర్శకత్వం వహిస్తున్నారు. సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందిస్తున్నాడు.  సెప్టెంబర్ 4న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.