నటనపై దృష్టి సారిస్తూ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు నిర్మాత యష్ రంగినేని. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫోటో స్టూడియో లాంటి సినిమాలు తీసి, నిర్మాతగా మంచి గుర్తింపును అందుకున్నారు యష్. హీరో విజయ్ దేవరకొండకు మేనమామ అయిన యష్.. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలు చేస్తున్నారు.
రీసెంట్‌గా రోషన్ నటించిన ‘ఛాంపియన్’ చిత్రంలో ఆయన కీలక పాత్రలో కనిపించారు. మాల వీరయ్య పాత్రలో ఆయన నటనకు మంచి స్పందన లభించింది. దీంతో ఇకపై నటుడిగా వరుస సినిమాలు చేసేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం యష్ రంగినేని నటిస్తున్న కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా, కొన్ని చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం పలువురు దర్శకులు ఆయన్ను సంప్రదిస్తున్నారు.
