PEDDI: అసలు ఇతను జగ్గూభాయేనా? ‘పెద్ది’లో అప్పలసూరిగా షాకింగ్ మేకోవర్!

PEDDI: అసలు ఇతను జగ్గూభాయేనా? ‘పెద్ది’లో అప్పలసూరిగా షాకింగ్ మేకోవర్!

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ "పెద్ది"(PEDDI). ఈ మూవీ ఫస్ట్ షార్ట్ తోనే భారీ అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలో రిలీజైన ఫస్ట్ సింగిల్ సైతం అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ హైప్ ని మరింత పెంచుతూ కొత్త పోస్టర్స్ అప్డేట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు పెద్ది మేకర్స్.

‘పెద్ది’ సినిమాలో నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. లేటెస్ట్గా ఈ సినిమాలో జగపతి బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ‘‘అప్పలసూరి’’ క్యారెక్టర్లో జగపతి బాబు, తెరపైకి తీసుకువచ్చే తీవ్రత అసమానమైనది" అని మేకర్స్ వెల్లడించారు. అప్పలసూరి పాత్ర సినిమాకు కీలకంగా ఉండనుందని  తెలిపారు.

గంభీరమైన లుక్‌, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ పాత్ర కోసం జగపతి బాబు ప్రత్యేకంగా మేకోవర్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు ఇతను జగ్గూభాయ్ అంటే నమ్మశక్యం కాకుండా లుక్ ఉంది. ఈ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో పోస్టర్ చేస్తే అర్థమవుతోంది.

ప్రస్తుతం పెద్ది మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పెద్ది షూటింగ్ జరిగింది.  రామ్ చరణ్ తెలంగాణ భవన్లో సందడి చేశారు. ఇపుడు కొత్త షెడ్యూల్తో బిజీగా ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే, వీరి పాత్రలకి సంబంధించిన పోస్టర్స్ విడుదలై ఆకట్టుకున్నాయి.

►ALSO READ | Allu Arjun, Atlee Movie OTT: ఇండియన్ సినిమాల్లోనే రికార్డు.. అల్లు అర్జున్–అట్లీ ఓటీటీ డీల్ రూ.600 కోట్లు!

ఇకపోతే, 'పెద్ది' చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, కెమెరాను ఆర్. రత్నవేలు, ఎడిటింగ్‌ను జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం మార్చి 27, 2026న గ్రాండ్‌గా పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. వరుస అంచనాలు పెంచుతూ వెళ్తోన్న ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.