టాలీవుడ్‌లో పెళ్లి సందడి మొదలైంది. 2026 కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఓ ముగ్గురు సెలబ్రిటీ జంటలు వరుసగా వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరిలో ఒక జంట, మార్చిలో మరో రెండు జంటలు పెళ్లి చేసుకోనుండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇంతకీ ఆ సెలబ్రెటీ కపుల్స్ ఎవరు? వారి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగనున్నాయి అనే దానిపై ఓ లుక్కేద్దాం.
విజయ్-రష్మిక పెళ్లి:
టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతున్న ప్రేమ ప్రచారానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట తెరదించారు. కొన్నేండ్లుగా రిలేషన్‌లో ఉన్న వీళ్లిద్దరూ.. గురువారం ఫిబ్రవరి 26న వివాహం చేసుకోనున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా విజయ్-రష్మికల పెళ్లి జరగనుంది.
ALSO READ : పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అరవింద్ ఫ్యామిలీ..
‘గీత గోవిందం’ సినిమాలో విజయ్, రష్మిక తొలిసారి కలిసి నటించారు. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’తో వీరి బంధం మరింత బలపడింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ పలుమార్లు వార్తలొచ్చాయి.
వెకేషన్‌కు కలిసి వెళ్లడం, ఇద్దరి ఫొటోస్‌లోనూ ఒకే లొకేషన్ కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలోనే అన్నీ రూమర్స్ కి చెక్ పెట్టి, అధికార ప్రకటన ఇచ్చేసి గురువారం ఒక్కటవ్వనున్నారు.
అల్లు శిరీష్- నయనిక పెళ్లి:
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ వివాహం సైతం, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన చిరకాల ప్రేయసి నయనికతో కలిసి ఏడడుగులు వేసేందుకు సమయం ఆసన్నమైంది. వచ్చే నెల మార్చి 6, 2026న ఈ జంట వివాహం జరగనుంది.
ALSO READ : ‘మన శంకరవరప్రసాద్ గారు’ టీమ్‌కు సన్మానం..
ఇక్కడ విశేషమేమిటంటే, అదే రోజు అల్లు అర్జున్ – స్నేహారెడ్డిల పెళ్లి రోజు కూడా. అన్నయ్య మ్యారేజ్ డే రోజే తమ్ముడు కూడా పెళ్లి చేసుకోవడం అల్లు కుటుంబంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఇప్పటికే, దుబాయ్, హైదరాబాద్ నగరాల్లో ప్రీవెడ్డింగ్ పార్టీ, ఇటీవలే తన ఇంట్లో పసుపు ఫంక్షన్ ను కూడా నిర్వహించారు.
పునర్నవి భూపాలం పెళ్లి
పునర్నవి భూపాలం: సినిమాలతో వచ్చిన క్రేజ్ కంటే ఈ అమ్మడికి బిగ్ బాస్తో వచ్చిన క్రేజ్ ఎక్కువ. బిగ్ బాస్లో బోల్డ్ కామెంట్స్తో తెగ హడావుడి చేసేది. త్వరలో పునర్నవి భూపాలం కూడా వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. మార్చి 20న అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో వివాహం చేసుకోనుంది. ఇటీవలే జరిగిన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుని ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇలా వరసగా తెలుగు ఇండస్ట్రీ నుంచి మూడు జంటలు పెళ్ళికి రెడీ అవ్వడంతో ఇండస్ట్రీలో సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే, విజయ్ రష్మికల పెళ్లి పనులు అలోమోస్ట్ పూర్తయ్యాయి. ఈ జంట ఇప్పటికే ఉదయ్ పూర్కి చేరుకొని పెళ్లి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
