Allu Sirish: పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అరవింద్ ఫ్యామిలీ.. శిరీష్ పెళ్లికి ఆహ్వానం!

Allu Sirish: పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అరవింద్ ఫ్యామిలీ.. శిరీష్ పెళ్లికి ఆహ్వానం!

అల్లువారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన ప్రేయసి నయానికా రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నారు. వీరి వివాహం 2026, మార్చి 6న ఘనంగా జరగనుంది. అదే రోజు శిరీష్ అన్నయ్య, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-స్నేహారెడ్డిల వివాహ వార్షికోత్సవం కూడా కావడంతో అల్లు కుటుంబంలో ఆ రోజు రెట్టింపు ఉత్సాహం నెలకొననుంది.

సంప్రదాయబద్ధంగా ఆహ్వానాలు

పెళ్లి పనులు మొదలైనప్పటి నుండి అల్లు కుటుంబం అత్యంత సంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తోంది. అల్లు అరవింద్ దంపతులు, శిరీష్‌తో కలిసి తొలుత మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను కలిసి పెళ్లి పత్రికను అందజేశారు. అనంతరం, నటుడు నాగబాబు దంపతులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాను కలిసి వివాహానికి ఆహ్వానించారు.  

ALSO READ :  ‘మన శంకరవరప్రసాద్ గారు’ టీమ్‌కు సన్మానం..

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  "నాన్న, అమ్మ, నేను కలిసి  పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవానిగారిని వివాహానికి ఆహ్వానించాము. అలాగే నాగబాబు గారు, పద్మజ గారిని కూడా కలిసి ఆహ్వానం పలికాము. వారందరూ నా పెళ్లి విషయంలో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు" అని రాసుకొచ్చారు. ఈ భేటీలో కుంకుమ భరిణెలు మార్చుకుంటూ వారు తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బన్నీ హోస్ట్ చేసిన 'మ్యాడ్ పార్టీ'

ఇటీవలే అల్లు శిరీష్ .. ప్రీ వెడ్డింగ్ షూట్ తో పాటు దుబాయ్ లో ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. అటు అల్లు శిరీష్ కోసం అన్నయ్య అల్లు అర్జున్ తన ఫామ్‌హౌస్‌లో గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ బాష్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెలతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీలో అందరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీనిని శిరీష్ ‘మ్యాడ్ పార్టీ’గా అభివర్ణించారు.

మార్చి 6న జరగనున్న అల్లు శిరీష్ , నయానికాల వివాహ వేడుకకు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్లందరూ హాజరుకానున్నారు. మరికొద్ది రోజుల్లోనే సంగీత్, మెహందీ వంటి ఇతర వేడుకల సందడి కూడా మొదలుకానుంది. నయానికా రెడ్డి వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకోగా, ఇప్పుడు అల్లు వారి కోడలిగా అడుగుపెడుతుండటంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.