Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్ గారు’ టీమ్‌కు సన్మానం.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి.!

Chiranjeevi:  ‘మన శంకరవరప్రసాద్ గారు’ టీమ్‌కు సన్మానం.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి.!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’.  సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దాదాపు రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ  ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచి, అభిమానులకు అసలైన పండగ విందును అందించింది. లేటెస్ట్ గా ఈ మూవీ చిత్ర యూనిట్ కు ఘనంగా సన్మానం జరిగింది.  ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్..
కాకినాడ పోర్ట్ చైర్మన్ కె.వి.రావు ఆధ్వర్యంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్ర యూనిట్‌కు హైదరాబాద్‌లో ఘనంగా సన్మానం జరిగింది. ఈ మెగా సక్సెస్ పార్టీలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ మెరిశారు. నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటిలతో పాటు, దర్శకులు కె. రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్,  వి.వి. వినాయక్, బాబీ, బుచ్చిబాబు సానా పాల్గొన్నారు. అలాగే అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, సురేష్ బాబు ఈ వేడుకలో పాల్గొని చిరంజీవికి అభినందనలు తెలిపారు.

ALSO READ : ఓటీటీలో మైండ్‌బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట..
కేవలం వినోదమే కాకుండా, భారీ కలెక్షన్లతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.  ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 350 కోట్లకు పై వసూళ్లు సాధించిన చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది.  అభిమానులతో పాటు మహిళా ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అటు ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. మెగాస్టార్ ఎనర్జీ, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పీరెన్స్, నయనతార గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిరంజీవి తన అసలు పేరుతోనే టైటిల్ ఉన్న సినిమాలో నటించడం, అది ఇంతటి విజయం సాధించడం అభిమానుల్లో ఫుల్ జోష్ ను నింపింది.