సినిమా రంగంలో అవకాశం దక్కించుకోవడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కొత్తవాళ్లకు సరైన బ్రేక్ రావడం అంత సులువు కాదు. అలాంటిది తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ లాంటి అగ్ర నటుడి సినిమాలో నటించే ఛాన్స్ వస్తే.. అది ఏ నటికైనా ఓ అరుదైన అవకాశమే. అటువంటి గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుని ఎంతో మురిసిపోయింది తమిళ టెలివిజన్ నటి ఆనంది అజయ్. అయితే, ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఊహించని షాక్ ఎదురైంది. ఆనంది నటించిన సీన్స్ ఫైనల్ కట్‌లో మేకర్స్ తొలగించడంతో తీవ్ర నిరాశకు గురయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కన్నీళ్లు పెట్టిన ఆనంది.. వీడియో పోస్ట్
సినిమాల్లో అవకాశం దక్కించుకోవడమే ఎంతో కష్టం. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్ర అయినా దక్కితే అది చాలా మంది నటీనటులకు పెద్ద బ్రేక్‌గా భావిస్తారు. అలాంటిది దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోతో ఒకే తెరపై కనిపించే అవకాశం వస్తే అది నిజంగా అరుదైన అదృష్టమే. తమిళ టెలివిజన్ నటి ఆనంది అజయ్కు కూడా అలాంటి లక్కీ ఛాన్స్ వచ్చింది. దాదాపు ఏడాది క్రితమే విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’లో ఆమెకు అవకాశం దక్కింది. సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది.
అయితే సినిమా విడుదలైన తర్వాత ఆమెకు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్ కట్‌లో తనకు సంబంధించిన అన్ని సన్నివేశాలను చిత్రబృందం తొలగించినట్లు తెలిసి ఆనంది తీవ్ర భావోద్వేగానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసిన ఆమె, ‘‘విజయ్‌తో ఒకే తెరపై కనిపించే అవకాశం కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఈ సినిమా కోసం ఏడాది పాటు ఎదురుచూశాను. ఇది విజయ్ చివరి సినిమా కావడంతో ఇక ఆయనతో కలిసి నటించే అవకాశం దొరకదేమో అనిపిస్తోంది. చాలా దురదృష్టంగా అనిపిస్తోంది’’ అంటూ ఆనంది ఎమోషనల్ అయింది.
ఈ వీడియోకు ‘జన నాయగన్ డిలీటెడ్ సీన్.. ఫీలింగ్ ఆన్ లక్కీ’ అనే క్యాప్షన్ కూడా జత చేసింది. ఇక వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ‘ధైర్యంగా ఉండండి.. మీకు త్వరలోనే మంచి లీడ్ రోల్స్ వస్తాయి’, ‘ఇది అంతం కాదు.. మీకు ఇంకా పెద్ద అవకాశాలు ఎదురుచూస్తున్నాయి’ అంటూ పలువురు తనని సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు.
