టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్, కోలీవుడ్ నటుడు ధృవ్ విక్రమ్ బ్రేకప్ అయ్యారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు వినిపించగా, తాజాగా అనుపమ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో వీరిద్దరి మధ్య ఓ ఘటన జరిగిందంటూ సోషల్ మీడియాతో పాటుగా ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
చెన్నై హోటల్ ఘటన నిజమేనా?
ఇటీవల చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో అనుపమ, ధృవ్ విక్రమ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ వివాదంలో అనుపమ.. హీరో ధృవ్ విక్రమ్ ప్రవర్తనను సహించలేక ఆగ్రహంతో చెప్పుతో కొట్టి, వీరి ప్రేమకి స్వస్తి చెప్పి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఘటన నిజంగా జరిగిందా? లేదా? అన్న విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులోకి రాలేదు.
ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతో పెరిగిన చర్చ..
ఇక మరోవైపు, అనుపమ ధృవ్ విక్రమ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసినట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అనంతరం ఆమె ‘‘ఇకపై ఎవరి అప్రూవల్స్, పర్మిషన్లు అవసరం లేదు.. నా జీవితం, నా వాయిస్ నేనే ఎంచుకుంటున్నాను. భయం లేదు.. ఎట్టకేలకు శాంతి నన్ను వెతుక్కుంటూ వచ్చింది’’ అనే భావంతో చేసిన పోస్టులు వైరల్ కావడంతో, ఇవి బ్రేకప్‌ను ఉద్దేశించినవేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
రూమర్స్ నిజమేనా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు, పోస్టులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ, అనుపమ పరమేశ్వరన్ లేదా ధృవ్ విక్రమ్ తమ వ్యక్తిగత సంబంధంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల బ్రేకప్, చెన్నై హోటల్ ఘటన, ఇతర ప్రచారాలన్నీ ప్రస్తుతం రూమర్స్, ఊహాగానాల స్థాయిలోనే ఉన్నాయి. వీరిద్దరి నుంచి అధికారికంగా అప్డేట్ వచ్చేవరకు వీటిని నిజమని నిర్ధారించలేం.
