'బిగ్ బాస్' హౌస్ టూర్.. వండర్‌ల్యాండ్ థీమ్.. మైండ్ బ్లాక్ చేసే మైండ్ గేమ్స్!

'బిగ్ బాస్' హౌస్ టూర్.. వండర్‌ల్యాండ్ థీమ్.. మైండ్ బ్లాక్ చేసే మైండ్ గేమ్స్!

ఇండియన్ బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' హిందీ సీజన్ 20 గ్రాండ్ లాంచ్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా సెప్టెంబర్ 6న జియోహాట్‌స్టార్, కలర్స్ టీవీలలో ఈ సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది..అయితే ఈ సారి హౌస్ లోకి 20 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టకముందే, వారుండబోయే కలల సామ్రాజ్యం 'బిగ్ బాస్ హౌస్' లుక్ బయటకు వచ్చింది. 'బిగ్ బాస్ హౌస్ టూర్' పేరుతో వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

వర్షా జైన్ అద్భుతాలు..

దాదాపు 19 ఏళ్లుగా బిగ్ బాస్ హౌస్‌ని డిజైన్ చేసిన ఒముంగ్ కుమార్ స్థానంలో..  ఈసారి సౌత్ బిగ్ బాస్ సెట్స్ డిజైనర్ వర్షా జైన్ బాధ్యతలు చేపట్టారు. కేవలం 48 రోజుల్లో 'ఆలిస్ ఇన్ వండర్‌ల్యాండ్' (Alice in Wonderland), మ్యాడ్ హ్యాటర్ థీమ్‌తో ఈ హౌస్‌ను ఒక మాయా ప్రపంచంలా తీర్చిదిద్దారు. ప్రేక్షకులను ఈ హౌస్ ఎంతో ఆకట్టుకుంటుంది

విచిత్రమైన ఎలిమెంట్స్...

హౌస్ మధ్యలో భారీ 'మ్యాడ్ హ్యాటర్' విగ్రహం ఆహ్వానం పలుకుతుండగా.. లీవింగ్ ఏరియాలో టీపాట్ నుండి పాలు వొలికినట్లు ఉండే పింక్ సోఫా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వీకెండ్ కా వార్ జోన్‌లో ఒక రాక్షస ఆక్టోపస్ తన చేతులతో చెస్ పావులను పట్టుకుని ఉన్న భయానకమైన డిజైన్ గేమ్ మైండ్ సెట్‌ను ప్రతిబింబిస్తుంది. ఇలాంటి విచిత్రమైన ఎలిమెంట్స్ తో హౌస్ తెగు ఆకట్టుకుంటోంది.

అంతే కాదు గార్డెన్ ఏరియాలో హాట్ ఎయిర్ బెలూన్ సీటింగ్, పాము చుట్టుకుని ఉన్న చెట్టు ఉన్నాయి. ఎంట్రెన్స్ వద్ద పెద్ద రింగ్ మాస్టర్ కాళ్ల మధ్య నుండి కంటెస్టెంట్లు లోపలికి వెళ్లాలి. ఇక స్విమ్మింగ్ పూల్ వద్ద భారీ షార్క్ తల, హౌస్ గోడలపై కనిపించే వందలాది కళ్లు (Eyes) బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నారు అనే ఫీల్‌ను తెప్పిస్తున్నాయి.

►ALSO READ | Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి తొలి కామనర్ ఎంట్రీ.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్!

రహస్య గదులు..- షాకింగ్ ట్విస్ట్‌లు..

ఈ సీజన్‌లో ఆరంభంలో 'జెయిల్' ఉండదు. అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నవి మాత్రం రూమ్ 20,  2X రూమ్. ఈ సీక్రెట్ రూమ్స్ వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటో ప్రసారం మొదలయ్యాకే తెలుస్తుందని డిజైనర్ సస్పెన్స్ మెయింటెన్ చేశారు. కంటెస్టెంట్లపై ఓ కన్నేసి ఉంచడానికి బిగ్ బాస్ హౌస్ లో ఏకంగా 104 కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఈ సారి 'బిగ్ బాస్ 20' హౌస్ లోకి కుశాల్ తన్వర్ (గుల్లు), కాజీ తౌకీర్, ఆర్షిఫా ఖాన్, షోవిక్ చక్రవర్తి, ఫైసల్ ఖాన్ వంటి ప్రముఖులు ఈసారి అడుగుపెట్టనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. విజువల్ వండర్‌గా మారిన ఈ మాయా ప్రపంచపు హౌస్ ప్రేక్షకులకు ఏ రేంజ్ డ్రామా అందిస్తుందో చూడాలి.