TCS ప్రతినిధులతో సీఎం కీలక సమావేశం.. రూ.70 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం

TCS ప్రతినిధులతో సీఎం కీలక సమావేశం.. రూ.70 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం

హైదరాబాద్: ప్రముఖ ఐటీ సంస్థ TCS ప్రతినిధులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీ రంగ విస్తరణ, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యంపై చర్చించారు. ఐటీ కంపెనీల పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని ఈ సందర్భంగా TCS కంపెనీ ప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు.

కొంగర్‌కలాన్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీకి వెళ్లే రోడ్డుకు రతన్‌ టాటా పేరు పెట్టామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  సమక్షంలో ప్రభుత్వానికి, TCS కు మధ్య అతి పెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. TCS–హైపర్ వాల్ట్ ప్రతినిధుల బృందంతో సమావేశం జరిగింది.

దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు ఈ సందర్భంగా ఎంవోయూ చేసుకున్నారు. హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్‌ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీసీఎస్, హైపర్‌వాల్ట్‌, భాగస్వామ్య సంస్థలు కలిపి ఈ ప్రాజెక్టులో రూ.70 వేల కోట్ల వరకు పెట్టుబడి పెడుతుండటం గమనార్హం. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగ అవకాశాలు ఈ డేటా సెంటర్తో రానుండటం విశేషం.

TCI ప్రతినిధులతో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు:
* ఫ్యూచర్ సిటీ మై డ్రీమ్.. గతంలోనే టాటా చైర్మన్ చంద్రశేఖర్తో మాట్లాడాను
* టాటా, టీసీఎస్, హైపర్ వాల్ట్ ఆధ్వర్యంలో అతిపెద్ద AI డాటా సెంటర్ 
* 70 వేల కోట్ల పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు 
* దీని ద్వారా 7000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి 
* కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు అత్యుత్తమ రోడ్లు 
* ఆ రోడ్డుకు భారతరత్న  రతన్ టాటా పేరు పెట్టాం
* జూన్ 2, 2028 నాటికి డాటా సెంటర్ ప్రారంభం చేయాలి
* దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి
* దీనికి సంబంధించి అన్ని విషయాల్లో ప్రభుత్వం అన్ని అనుమతులు ఇయ్యడానికి సిద్ధంగా ఉంది