ఆపిల్ కొత్త ఫోల్డబుల్ ఐఫోన్.. క్వాలిటీ విషయంలో తగ్గేదే లే.. జస్ట్ వంద ఫోన్లు మాత్రమే!

ఆపిల్ కొత్త ఫోల్డబుల్ ఐఫోన్.. క్వాలిటీ విషయంలో తగ్గేదే లే.. జస్ట్ వంద ఫోన్లు మాత్రమే!

అమెరికన్ టెక్ కంపెనీ  ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే నాణ్యత విషయంలో ఆపిల్ పాటించే కఠినమైన నిబంధనల వల్ల దీని ఉత్పత్తి ప్రస్తుతం చాలా నెమ్మదిగా సాగుతోంది. దింతో రోజుకు కేవలం కొన్ని వందల ఫోన్లు మాత్రమే తయారవుతున్నాయి.

ఈ ఫోన్‌కు సంబంధించి విడిభాగాల కొరత వల్ల ఉత్పత్తి తగ్గలేదని, కేవలం క్వాలిటీ విషయంలో ఆపిల్ రాజీ పడకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని  నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆపిల్ మార్కెట్లోకి తెచ్చే కోట్ల కొద్దీ ఫోన్లతో పోలిస్తే, ఈ ఫోల్డబుల్ మోడల్ తొలి ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది.

మార్కెట్లోకి వచ్చే అడ్డంకులు:
ఈ ఫోన్ తయారీ సమయంలో ఆపిల్‌కు కొన్ని సాంకేతిక సవాళ్లు ఎదురయ్యాయి. కొత్త రకం డిస్‌ప్లేలు, వాడే మెటీరియల్స్ చాలా క్లిష్టంగా ఉండటం వల్ల ప్రారంభంలో సరఫరా కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, ఇతర కంపెనీలు చిప్స్ కొరతతో ఇబ్బంది పడుతున్నా, ఆపిల్ మాత్రం ఈ ఏడాది ఉత్పత్తి అంచనాలను ఏకంగా కోటి యూనిట్లకు పెంచేసింది.

ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌లో ఉండే ప్రత్యేకతలు:
*దీని డిజైన్  పుస్తకంలా మడతపెట్టే వీలుగా (బుక్-స్టైల్) ఉంటుంది. లోపలి స్క్రీన్ సుమారు 7.8 అంగుళాలు, బయటి కవర్ స్క్రీన్ 5.5 అంగుళాలు ఉండవచ్చు.

*ఇక   ఫీచర్లు చుస్తే  లిక్విడ్‌మెటల్  హింజ్ టెక్నాలజీ, శక్తివంతమైన A20 చిప్, ఆపిల్ సొంత C2 మోడెమ్ ఇందులో ఉండనున్నాయి.

ALSO READ : MIVI నుంచి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది..

*సేఫ్టీ పరంగా ఫేస్ ఐడికి బదులుగా పవర్ బటన్‌లోనే టచ్ ఐడి (ఫింగర్‌ప్రింట్) ఇచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ సంస్థ ఈ ఫోన్ కోసం ప్రత్యేకంగా డిస్‌ప్లేలను సప్లయ్ చేయనుంది.

*దీని ధర విషయానికి వస్తే  ఇది అత్యంత ఖరీదైన ఫోన్‌గా నిలవనుంది. ఫీచర్లను బట్టి దీని ధర సుమారు రూ. 1.70 లక్షల నుంచి రూ. 2.50 లక్షల ($2,000 నుండి $3,000) వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నార