ఈయన ఎంపీ పప్పూ యాదవా.. నిజం చెప్పండి.. ఇంత చిన్న పిల్లోడిలా కనిపిస్తున్నాడేంటీ..!

ఈయన ఎంపీ పప్పూ యాదవా.. నిజం చెప్పండి.. ఇంత చిన్న పిల్లోడిలా కనిపిస్తున్నాడేంటీ..!

ఏంటి ఈయన ఎంపీ పప్పు యాదవా..? జోక్ చేస్తున్నారా ఏంటి.. ఈయన పప్పు యాదవ్ ఏంటి..? అక్కడున్నది AI పప్పు యాదవ్..! సగం పప్పు యాదవ్ ఉన్నాడు సరే కానీ, మిగతా సగం పప్పు యాదవ్ ఎక్కడ..? ఇది ఎంపీ పప్పు యౌదవ్ వీడియో చుసిన నెటిజన్స్ రియాక్షన్. ఇటీవల ఎంపీ పప్పు యాదవ్ మీడియాతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పప్పు యాదవ్ గుర్తు పట్టలేనంతగా మారిపోవడమే ఇందుకు కారణం. మునుపకంటి చాలా సన్నబడ్డ పప్పు యాదవ్.. జుట్టుకు రంగు వేసి.. వయసులో 20 ఏళ్ళు వెనక్కి వెళ్లినట్లు కనిపించడం చూసి అంతా షాక్ అయ్యారు.

సీజేపీ కార్యకర్త నిషు ఆజాద్ కేసుపై పప్పు యాదవ్ మీడియాతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పప్పు యాదవ్ మాట్లాడుతున్న కేసు విషయం కాకుండా ఆయన లుక్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలామంది తాము మొదట్లో పప్పు యాదవ్ ను గుర్తించలేకపోయామని అన్నారు.

ALSO READ : MIVI నుంచి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. 

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు నెటిజన్స్ రకరాలుగా కామెంట్ చేస్తున్నారు.ఇది ఫేక్ న్యూస్.. ఆయన పప్పు యాదవ్ కాదు.. దయచేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ఇది ఒజెంపిక్ ఎఫెక్ట్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 

ఈయన ఒరిజినల్ పప్పు యాదవ్ కాదు... AI జెనరేటెడ్ పప్పు యాదవ్ అంటూ ఇంకొంతమంది కామెంట్ చేశారు. అయితే.. పప్పు యాదవ్ లో ఈ భారీ మెరుపు కారణాలేంటో ఆయన కానీ.. ఆయన స్టాఫ్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.