తమిళ నటుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram), హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) బ్రేకప్ వ్యవహారం, ఆపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై తాజాగా ధ్రువ్ విక్రమ్ స్పందించడం, ఇద్దరి మధ్య జరిగిన పరిణామాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి...
ధ్రువ్ విక్రమ్ రియాక్షన్ వైరల్:
'ఇండియా టుడే తమిళ రౌండ్‌టేబుల్' కార్యక్రమంలో ధ్రువ్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ట్రోల్స్ మరియు పబ్లిక్ లో నెలకొన్న అనుమానాలపై తొలిసారిగా నోరు విప్పారు. "ఈ మధ్య జరిగిన పరిణామాలు, నా బ్రేకప్ తాలూకు కఠినమైన రోజులు నన్ను వ్యక్తిగతంగా చాలా ఎఫెక్ట్ అయ్యేలా చేశాయి. ఇలాంటి సమయంలో వాస్తవానికి దగ్గరగా ఉండటం ముఖ్యం. మనమేమిటో, దేనికోసం నిలబడ్డామో తెలుసుకోవాలి. మనల్ని మనం నమ్ముకుంటూ, మనకు ఇష్టమైన వాళ్లను కాపాడుకుంటూ ముందుకు సాగాలి" అని ఆయన తెలిపారు.
#IndiaTodayTamilRoundTable | Why isn't Dhruv Vikram very active on social media? Or does he have a private account that no one knows about?
— IndiaToday (@IndiaToday) August 17, 2026
Here's what the actor had to say.#TamilNadu #DhruvVikram | @Akshita_N @anaghakesav pic.twitter.com/Nv0zJNEqny
సోషల్ మీడియాపై క్లారిటీ: తాను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడానికి ఎలాంటి పెద్ద ప్లానింగ్ లేదని, తన తండ్రి (విక్రమ్), తన మేనకోడలు, పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు తీసి ఎడిట్ చేయడం ఇష్టమని చెప్పారు. ప్రమోషన్స్ సమయంలో మాత్రమే యాక్టివ్‌గా ఉండి, మిగతా సమయంలో పుస్తకాలు చదవడం, సంగీతంతో గడపడం తన అలవాటు అని స్పష్టం చేశారు.
అనుపమ కామెంట్స్: అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ తాను గతంలో రెండేళ్లపాటు ఓ రిలేషన్‌షిప్‌లో తీవ్రమైన మానసిక వేదన (నార్సిసిస్టిక్ అబ్యూజ్) అనుభవించానని, ఆ వ్యక్తి ప్రవర్తన అపరిచితుడు సినిమాలోని పాత్రలా ఒకరోజు లవింగ్‌గా (Remoలా), మరోరోజు మరోలా ఉండేదని పేర్కొన్నారు. ఆ బంధం వల్ల తాను మానసికంగా, శారీరకంగా ఎంతో నష్టపోయానని, పెళ్లి వరకు వెళ్లిన ఆ బంధాన్ని చివరికి రద్దు చేసుకున్నానని తెలిపారు. అయితే ఆమె ఎక్కడా ధ్రువ్ పేరు నేరుగా ప్రస్తావించలేదు. ధ్రువ్ లేదా అతని టీమ్ కూడా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి వీరిద్దరి మధ్య సంబంధంపై వస్తున్న ఆరోపణలన్నీ కేవలం సోషల్ మీడియా ప్రచారాలు, ఊహాగానాలే అవుతున్నాయి.
#AnupamaParameswaran Opens up about her Toxic Relationship:
— Laxmi Kanth (@iammoviebuff007) August 12, 2026
"For People who don't know Narcissistic abuse.. Imagine having "Anniyan" in your life.. One day He's Remo.. You feel like," How Lucky am I to get a person like this in my life.. it's like a dream.." Next day.. You see…
'బైసన్' సమయంలోనే ప్రేమ: వీరిద్దరూ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'బైసన్ కాలమడన్' (Bison Kaalamaadan) చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని, సోషల్ మీడియాలోనూ వీరికి సంబంధించిన ఫొటోలు, పోస్టులు వైరల్ అయ్యాయని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.
సోషల్ మీడియా డిస్కషన్స్: అనుపమ చేసిన కామెంట్స్ తర్వాత నెటిజన్లు గతంలో వీరిద్దరూ కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలను వెలికితీస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలలో అనుపమ సోషల్ మీడియా పోస్టులను కూడా ధ్రువ్ కంట్రోల్ చేసేవాడని చెప్పిన పాత వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.
