అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘కెన్నెడీ’ ఫిబ్రవరి 20, 2026 నుంచి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2023 మే 25న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలిసారి ప్రదర్శింపబడిన ఈ చిత్రం, థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో (హిందీ/ఇంగ్లీష్) విడుదలైంది.
ఈ కెన్నెడీ సినిమాలో రాహుల్ భట్ టైటిల్ రోల్ పోషించగా, సన్నీ లియోనీ 'ఛార్లీ' అనే కీలక పాత్రలో కనిపించింది. మోహిత్ తకల్కర్, అభిలాష్ థప్లియాల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో అదరగొడుతుంది. ట్విస్టులు, ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని అలరిస్తుంది.
The stars have aligned well for Kennedy💫
— ZEE5Official (@ZEE5India) February 22, 2026
Kennedy streaming now, only on #ZEE5#KennedyOnZEE5 pic.twitter.com/e5dwHZsNFA
కథేంటంటే:
ఉదయ్ శెట్టి (రాహుల్ భట్) ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్. సస్పెండ్ అయిన తర్వాత అధికారులు అతను చనిపోయినట్టు ప్రకటిస్తారు. కానీ.. అతను 'కెన్నెడీ' అనే పేరుతో బతికే ఉంటాడు. సీక్రెట్‌గా ముంబైలో ఒక అవినీతి పోలీస్ కమిషనర్ రషీద్ ఖాన్ (మోహిత్ తకల్కర్) కోసం హిట్‌మ్యాన్‌గా పనిచేస్తుంటాడు. చట్టం పేరిట జరిగే అక్రమ హత్యలు అతని చేతుల మీదుగా జరుగుతుంటాయి.
►ALSO READ | Prakash Raj: ముదరుతున్న బీఫ్ ఫ్రై Vs 'కేరళ స్టోరీ 2'.. ప్రకాష్ రాజ్ కాంట్రవర్సియల్ కామెంట్స్ వైరల్!
అంటే, రషీద్ ఖాన్ ఎవరిని చంపమంటే వాళ్లను చంపుతుంటాడు. నిద్రలేమితో బాధపడుతూ మాస్క్ పెట్టుకుని రాత్రిళ్లు సిటీలో తిరుగుతుంటాడు. అదే క్రమంలో తన కుటుంబ జీవితాన్ని నాశనం చేసిన అండర్ వరల్డ్ డాన్ సలీం సమాచారం కోసం వెతుకుతాడు. అప్పుడే అతనికి చార్లీ (సన్నీ లియోన్) పరిచయం అవుతుంది.
చార్లీ ఒక భావోద్వేగాలతో నిండిన, కానీ పరిస్థితుల చేతిలో చిక్కుకున్న మహిళ. కెన్నెడీ–చార్లీ మధ్య ఏర్పడే అనుబంధం కథకు కొత్త మలుపు ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అతని లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. చివరికి కెన్నెడీ తన ప్రతీకారం తీర్చుకుంటాడా? లేక అతని జీవితమే మరింత చీకటిలోకి వెళ్లిపోతుందా? అనేది సినిమా చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది.
విశ్లేషణ:
అనురాగ్ కశ్యప్ స్టైల్‌కు తగినట్టే, ఈ సినిమా డార్క్, స్లో-బర్న్ నేరేటివ్‌తో సాగుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే పాత్రల అంతర్మథనంపై ఎక్కువ ఫోకస్ చేశారు. రాహుల్ భట్ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు.
అతని కళ్లలో కనిపించే బాధ, ఒంటరితనం పాత్రను బలంగా నిలబెట్టాయి. సన్నీ లియోన్‌కు ఇది పూర్తిగా భిన్నమైన పాత్ర. గ్లామర్‌కు మించి భావోద్వేగాలను వ్యక్తం చేసే అవకాశం ఈ సినిమాలో లభించింది.మోహిత్ తకల్కర్ పోలీస్ కమిషనర్ పాత్రలో మెచ్యూర్ నటన చూపించారు.
కెన్నెడీ మానసిక పరిస్థితి, అతని నిద్రలేమి, ఒంటరితనం.. ఇవన్నీ కథలో సైకాలజికల్ డెప్త్‌ను పెంచుతాయి. ప్రేక్షకుడు అతని మైండ్‌సెట్‌లోకి వెళ్లిపోతాడు. యాక్షన్ సీన్స్ స్టైలిష్‌గా కాకుండా రా మరియు రియలిస్టిక్‌గా ఉంటాయి. అందువల్ల కథ నిజ జీవితానికి దగ్గరగా అనిపిస్తుంది.
