'ది కేరళ స్టోరీ' 2023లో రీలీజ్ అయినప్పుడు ఎంతటి వివాదం సృస్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు దాని సీక్వెల్ గా వస్తున్న 'ది కేరళ స్టోరీ 2' కూడా మళ్లీ వివాదాలకు క్రేంద్ర బిందువుగా మారుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వివాదాస్పద చిత్రంగా మద్రపడిన 'ద కేరళ స్టోరీ 2 'ట్రైలర్ విడుదలైన వేళ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ మరింత ఆజ్యం పోస్తోంది.
అసలు ఏం జరిగిందంటే?
ఈ మూవీ ట్రైలర్ లో బలవంతపు మతమార్పిడులతో పాటు, బలవంతంగా బీఫ్ తినిపించే దృశ్యాలను చూపించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్, కేరళలో ఎంతో ప్రసిద్ధి చెందిన 'స్లో-కుక్డ్ బీఫ్ ఫ్రై', కొబ్బరి కూర ఉన్న ఫోటోలను షేర్ చేశారు. వాటికి "ఇదే అసలైన కేరళ స్టోరీ (#TheRealKeralaStory)" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.: కేరళ సంస్కృతిలో ఆహారం అనేది కులమతాలకు అతీతమైనది. ముఖ్యంగా కేరళ సిరియన్ క్రిస్టియన్ సంప్రదాయాల్లో బీఫ్ వంటకాలు ఒక భాగమని, కేరళ వైవిధ్యాన్ని తప్పుగా చూపిస్తున్న వారికి ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
అసలు ఏం జరిగింది?
ఇటీవల 'ద కేరళ స్టోరీ 2' ట్రైలర్ విడుదలైంది. ఇందులో బలవంతపు మతమార్పిడులతో పాటు, బలవంతంగా బీఫ్ (గోమాంసం) తినిపించే దృశ్యాలను చూపించారని సమాచారం. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్, కేరళలో ఎంతో ప్రసిద్ధి చెందిన 'స్లో-కుక్డ్ బీఫ్ ఫ్రై', కొబ్బరి కూర ఉన్న ఫోటోలను షేర్ చేశారు. వాటికి "ఇదే అసలైన కేరళ స్టోరీ (#TheRealKeralaStory)" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
రెండుగా చీలిపోయిన నెటిజన్లు
ప్రకాష్ రాజ్ వేసిన ఈ "ట్విస్ట్" సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాష్ రాజ్ చేసిన పనిని 'వ్యాపార రాజకీయాలపై వేసిన దెబ్బ'గా అభివర్ణిస్తున్నారు. కేరళ అస్తిత్వాన్ని, అక్కడి ఆహార స్వేచ్ఛను ఆయన గౌరవించారని, సినిమా పేరిట సృష్టిస్తున్న విద్వేషానికి ఇది రుచికరమైన సమాధానమని ప్రశంసిస్తున్నారు. మరో వైపు ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "బీఫ్ ఫోటోలు పెట్టే ధైర్యం ఉన్న మీకు, పోర్క్ ఫోటోలు పెట్టే దమ్ముందా?" అంటూ సవాల్ విసురుతున్నారు. ప్రకాష్ రాజ్ కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని, ఇది 'సెక్యులరిజం' కాదని విమర్శిస్తున్నారు.
The real #KeralaStory is how… “In its mouth-watering culinary journey, Kerala’s yummy Syrian Christian beef fry and the coconut beef have added legacy, history and culture to the recipe.” Please try n relish 😜😜😜😜 #justasking pic.twitter.com/PdbYT0m0N2
— Prakash Raj (@prakashraaj) February 21, 2026
సినిమాపై కేరళ సీఎం సీరియస్..
కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఈ చిత్రంపై సిరీయర్ అయ్యారు. ఉగ్రవాదానికి కేంద్రంగా కేరళను చూపించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ సినిమా ఉందని సీరియస్ అయ్యారు . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ప్రకాష్ రాజ్ తన #JustAsking హ్యాష్ ట్యాగ్‌తో ఎప్పుడూ వ్యవస్థను ప్రశ్నిస్తుంటారు. కానీ ఈసారి ఆయన అడిగిన ప్రశ్న కంటే, ఆయన చూపించిన 'ప్లేటు' మరింత వివాదానికి దారితీస్తోంది .
►ALSO READ | Aaya Sher Promo: బొట్టు బొట్టు ఆకలి ఉంది.. మెట్టు మెట్టు ఎక్కుతారా.. ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
వివాదం వెనుక అసలు కథ..
2023లో విడుదలైన 'ద కేరళ స్టోరీ' భారీ వసూళ్లు సాధించినప్పటికీ, కేరళలోని వాస్తవ పరిస్థితులను వక్రీకరించిందని తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు పార్ట్-2 ట్రైలర్ కూడా అదే తరహాలో ఉండటంతో కేరళ రాజకీయాల్లోనూ వేడి మొదలైంది. కేరళ చరిత్రలో గోరక్షణకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని కొందరు వాదిస్తుంటే, కేరళ అంటేనే సహజీవనం , వైవిధ్యమైన ఆహారపు అలవాట్లని మరికొందరు గుర్తు చేస్తున్నారు.ఏది ఏమైనా, ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్ 'కేరళ స్టోరీ 2' ప్రమోషన్స్‌కు కలిసివస్తున్నా.. భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆహారపు అలవాట్లపై దేశవ్యాప్త చర్చను మళ్ళీ మొదలుపెట్టింది.
