టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ది ప్యారడైజ్’(The Paradise). ‘దసరా’వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. లేటెస్ట్గా సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఆయా షేర్’ (Aaya Share) అనే సాంగ్ ప్రోమోను పంచుకుంటూ సాలిడ్ క్యాప్షన్ పెట్టారు. ‘సింహం తన గుండెల్లోంచి నృత్యం చేయడం ఎప్పుడైనా చూశారా? రేపు మీరు చూస్తారు. దాని గర్జన యొక్క తాలూకూ చిన్న వీడియో చూసేయండి ఇప్పుడు’’ అని బ్లాస్ట్ ఇచ్చారు.
►ALSO READ | VijayRashmika: సోమవారం ఉదయమే ఉదయ్‌పూర్ చేరిన రష్మిక–విజయ్.. లగ్జరీ విల్లాల్లో అతిథులకి ప్రత్యేక ఏర్పాట్లు!
‘‘బొట్టు బొట్టు ఆకలి ఉంది.. ఆయా షేర్, మెట్టు మెట్టు ఎక్కుతారా.. ఆయా షేర్, పేరు పత్తా లేనోనిరా.. ఆయా షేర్.. చూస్కో ప్యారడైజ్కే అడ్రస్ అయితా.. ఆయా షేర్’’ అనే పదాలు మట్టివాసనలో యుద్దాన్ని సృశిస్తున్నాయి. మాస్ ఆడియెన్స్కు ఫుల్ కిక్కిచ్చే విధంగా అనిరుధ్ మ్యూజిక్, కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఉన్నాయి. జంగిరెడ్డి, దేవయ్య మట్టిగొంతులతో పాడారు. ఈ ఆయా షేర్ పూర్తి సాంగ్ ఊరమాస్ బీట్తో రేపు ఫిబ్రవరి 24న దుమ్మురేపనుంది.
‘ది ప్యారడైజ్’ రిలీజ్ అప్డేట్..
నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ‘ది ప్యారడైజ్’ తెరకెక్కుతుంది. మొదట ఈ చిత్రాన్ని మార్చి 26, 2026న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే మరింత పర్ఫెక్షన్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతో విడుదల తేదీని ఆగస్టు 21కి మార్చినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రంలో నానితో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సీరియస్ రోల్‌లో మెరవబోతుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే సోనాలి కులకర్ణి కీలక పాత్రలో నటిస్తున్నారు.
Mere Pyaare Paradise Waasiyon - #JadalZamanaFromAug21 🔥🌋🥁#TheParadise GRAND RELEASE WORLDWIDE ON AUGUST 21st, 2026 ❤🔥
— SLV Cinemas (@SLVCinemasOffl) February 12, 2026
Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, Bengali, English, and Spanish.
Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An… pic.twitter.com/n0VWPBFN0y
భారీ నిర్మాణం
SLV Cinemas బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టెక్నికల్‌గా, విజువల్‌గా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి, నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలుస్తున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో భారీ సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
