టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్స్ విజయ్-రష్మిక (VijayRashmika) తమ పెళ్లిని ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించారు. పెళ్ళికి 4 రోజుల ముందువరకు కూడా తమ ప్రేమని, వివాహ విషయాలను సీక్రెట్గా ఉంచిన ఈ జంట, వేడుక సమయం దగ్గరపడుతుండటంతో మౌనం వీడి అభిమానులతో శుభవార్త పంచుకున్నారు.
ఆదివారం (ఫిబ్రవరి 22న) ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ జంట తమ పెళ్లిని అధికారికంగా ధృవీకరించారు. గురువారం ఫిబ్రవరి 26న తమ పెళ్లి జరగనున్నట్లు స్పెషల్ నోట్తో తమ అనుబంధాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా తమ వివాహానికి “ది వెడ్డింగ్ ఆఫ్ VIROSH” అని పేరు పెట్టి అభిమానుల్లో మరింత ప్రేమను సంపాదించుకున్నారు.
‘ది వెడ్డింగ్ ఆఫ్ VIROSH’ పేరుకు ప్రత్యేకత
విజయ్ – రష్మిక తమ వివాహానికి “The Wedding of VIROSH” అని పేరు పెట్టడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ జంటను “VIROSH” అనే పేరుతో అభిమానులే కొన్ని సంవత్సరాల నుండి పిలుస్తూ వస్తున్నారు. ఇపుడు అదే పేరును తమ పెళ్లికి పెట్టడం ద్వారా అభిమానుల్లో మరింత స్థానం సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం రాసిన నోట్ లో..
“మా ప్రియమైనవారికి.. మేము ఈ నిర్ణయం తీసుకునే ముందే, మీరు మాతో ఉన్నారు. మీరు ప్రేమతో మాకు ‘VIROSH’ అనే పేరు ఇచ్చారు. అందుకే మా కలయికకు ‘ది వెడ్డింగ్ ఆఫ్ ‘VIROSH’ అని పేరు పెడుతున్నాం. మీ ప్రేమ ఎప్పటికీ మాలో భాగమే.” అని తెలిపారు.
ఉదయపూర్ వేదికగా ఏడడుగులు..
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సమీపంలో అరవళ్ల కొండల మధ్య ఉన్న ‘ది మెమెంటోస్ బై ఐటిసి హోటల్స్’ (ITC Mementos Udaipur) లో ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి. పూర్తిగా గోప్యత కలిగిన ఈ లగ్జరీ రిసార్ట్ 117 ప్రైవేట్ విల్లాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అతిథుల కోసం విల్లాలనే వసతి ఏర్పాటుగా సిద్ధం చేసినట్లు సమాచారం.
►ALSO READ | Allu Sirish Wedding: బ్లాక్ డ్రెస్లో అల్లు శిరీష్–నయనిక గ్లామర్ షో.. ప్రీ-వెడ్డింగ్ ఫోటోలు వైరల్!
ప్రాంగణంలోనే సరస్సు, నది ఉండటంతో పాటు ప్రైవేట్ హెలిప్యాడ్ సౌకర్యం కూడా ఉంది. మొత్తం కొండపై విస్తరించి ఉన్న ఈ ప్రాపర్టీ వివాహ వేడుకలకు రాజసంగా మారనుంది. ఇది ఉదయ్‌పూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో అరవళ్ల పర్వత శ్రేణుల మధ్య విరాజిల్లుతున్న అందమైన లొకేషన్లలో ఉంది.
అతిథుల రాక, భద్రతా ఏర్పాట్లు..
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండతో పాటుగా దాదాపు 50 మంది అతిధులతో ఇవాళ (ఫిబ్రవరి 23న) ఉదయం ఉదయపూర్ విమానాశ్రయంలో దిగారు. రాజస్థాన్‌లోని సిటీ ఆఫ్ లేక్స్‌లో మూడు రోజుల పాటు జరిగే వివాహా వేడుకలో పెద్దగా సినీ తారలు హాజరు కానప్పటికీ, తెలంగాణకు చెందిన కొంతమంది రాజకీయ ప్రముఖులు, కొందరు సినీ దర్శకులు పాల్గొననున్నట్లు సమాచారం. మొత్తం ఆహ్వానితుల సంఖ్య దాదాపు 100 మందికి పరిమితమయ్యే అవకాశముందని టాక్.
