తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జననాయగన్’ (తెలుగులో‘జన నాయకుడు’). రేపు గురువారం (జూలై 23, 2026న) ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఖాకీ’ ఫేమ్ H. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు ఏడు నెలల సెన్సార్ ప్రక్రియ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే, సినిమా చూసిన సెన్సార్ టీమ్తో పాటుగా ‘జననాయగన్’ టీం సన్నిహిత వర్గాల నుంచి వచ్చిన టాక్ వైరల్ అవుతుంది.
స్టోరీ ఏంటంటే?
ఈ చిత్రంలో విజయ్ (వెట్రి కొండన్) అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే (కాయల్) పాత్రలో నటించగా, మమితా బైజు విజయ్ పెంచి పెద్ద చేసిన విజయలక్ష్మి (విజ్జి) పాత్రలో కనిపించనుంది. విజ్జిని మాఫియా డాన్‌గా నటించిన (బాబీ డియోల్) నుంచి రక్షించేందుకు హీరో చేసే పోరాటమే సినిమా మెయిన్ స్టోరీ అని సెన్సార్ సమాచారం.
రన్‌టైమ్, సెన్సార్
‘జననాయగన్’ మూవీకి 183 నిమిషాలు (3 గంటల 3 నిమిషాలు) రన్‌టైమ్‌ను ఖరారు చేశారు మేకర్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి 'A' (Adults Only) సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే 18 ఏళ్లు పైబడినవారు ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు మాత్రం తల్లిదండ్రుల అనుమతితో చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఫస్ట్ టాక్ ఎలా ఉంది?
సినిమా చూసిన కొందరి సమాచారం ఆధారంగా వస్తున్న తొలి స్పందనల ప్రకారం, విజయ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచారని టాక్ వినిపిస్తోంది. రాజకీయ అంశాలను దర్శకుడు హెచ్. వినోద్ క్లాసీగా, వెస్ట్రన్ స్టైల్‌లో ప్రజెంట్ చేశారని అంటున్నారు. పొలిటికల్ డైలాగ్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు విజిల్స్ వేయించేలా ఉంటాయని సమాచారం.
అలాగే సినిమాలో ఎంజీఆర్ (MGR) ప్రస్తావనలు, విజయ్ 'నాన్ ఆణైయిట్టాల్' పాట పాడే సన్నివేశం, థియేటర్‌లో జరిగే కీలక అగ్నిప్రమాద ఘట్టం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని టాక్. పూజా హెగ్డే గ్లామర్, మమితా బైజు నటన కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.
All set for THALAPATHY KACHERI ♥️#JanaNayaganFromJuly23#JanaNayakuduFromJuly23#JanNetaFromJuly23
— KVN Productions (@KvnProductions) July 21, 2026
The Hon'ble Chief Minister @actorvijay @TheKVNofficial @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol @_mamithabaiju @Jagadishbliss @LohithNK01 @RamVJ2412… pic.twitter.com/87nDD0dEkQ
‘భగవంత్ కేసరి’ రీమేక్?
ఈ సినిమా ‘భగవంత్ కేసరి’ రీమేక్ అనే ప్రచారంపై నిర్మాత స్పష్టత ఇచ్చారు. ఆ సినిమా తమకు ఎంతో నచ్చిందని, అందులోని రెండు సన్నివేశాలను మాత్రమే స్ఫూర్తిగా తీసుకున్నామని, మిగతా కథ మొత్తం కొత్తగా రూపొందించామని వెల్లడించారు. దర్శకుడు అనిల్ రావిపూడితో కూడా ఈ విషయంపై చర్చించినట్లు తెలిపారు. గర్ల్ చైల్డ్ ఎంపవర్‌మెంట్, సమాజంలో మార్పు తీసుకురావాలనే సందేశంతో యువతను ఆలోచింపజేసే చిత్రంగా 'జన నాయకుడు' రూపొందిందని చెప్పారు.
ఇకపోతే, సినిమాపై ప్రస్తుతం వస్తున్న ఫస్ట్ రివ్యూ టాక్ పూర్తిగా అనధికారిక తొలి అభిప్రాయాలు మాత్రమే. అధికారిక రివ్యూలు, ప్రేక్షకుల తీర్పు రేపు సినిమా విడుదల అనంతరం స్పష్టమవుతుంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం, ‘జననాయగన్’ విజయ్ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
