హీరో అల్లు శిరీష్ త్వరలో తన ప్రియురాలు నయనికతో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. మార్చి 6న ఈ జంట ఏడడుగులు వేయనుండగా, పెళ్లి పనుల్లో వేగం పెంచారు.
ఇప్పటికే, అల్లు వారి ఇంట స్టార్స్ మీటింగ్స్, దుబాయ్‌లో పార్టీస్, పసుపు దంచుడు వంటి కార్యక్రమాలు పూర్తీ అయ్యాయి. ఇందులో భాగంగా లేటెస్ట్గా అల్లు శిరీష్-నయనికల మ్యారేజ్ సందర్భంగా అల్లు అర్జున్-స్నేహ రెడ్డి జంట హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ పార్టీని నిర్వహించారు.
ఈ ఈవెంట్కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన కొణిదెల జంట ముఖ్య అతిథులుగా అటెండ్ అయ్యి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. అలాగే, శ్రీలీల, రానా వైఫ్ మిహీక బజాజ్, నిధి అగర్వాల్, రాశి ఖన్నా, కృతిశెట్టి, నేహా శెట్టి మరియు ఇతర ప్రముఖ స్టార్స్ ఈ వేడుకలో పాల్గొన్నారు. లేటెస్ట్గా శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీస్ నుండి కొన్ని ఫోటోలను పంచుకున్నాడు. దీనిని 'మ్యాడ్ పార్టీ' అనే క్యాప్షన్తో పిలిచి అల్లు ఫ్యాన్స్లో జోష్ పెంచాడు.
ఈ ఫోటోలలో అల్లు శిరీష్–నయనిక రొమాంటిక్ ఫోజులతో ఫ్యాన్స్ని మంత్రముగ్ధులయ్యేలా చేశారు. ఒకరికొకరు చాలా క్లోజ్ షార్ట్లో రొమాంటిక్గా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు శిరిష్ తన ఫీలింగ్స్‌ను షేర్ చేస్తూ.."నాకు మరియు నయనికకు అర్జున్ & స్నేహ ఇచ్చిన పార్టీ ఎంతో పిచ్చిగా ఉంది. మేము ఇద్దరం బ్లాక్ డ్రెస్సుల్లో చాలా అందంగా కనిపించాము. నా స్టైలిస్టులు అశ్విన్ & హాసన్ ఖాన్ ఈ ఒక్క ఈవెంట్కి మాత్రమే నాకు ఇష్టమైన బ్లాక్ డ్రెస్ను వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు" అని శిరీష్ తెలిపారు.
అలాగే, అల్లు శిరీష్ తన సోదరుడు అల్లు అర్జున్ మరియు వదిన స్నేహ రెడ్డి ఈ విందుకు ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా, రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ఒకరికొకరు ఆప్యాయంగా కౌగిలించుకుని ఫ్యాన్స్లో జోష్ పెంచారు. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ పార్టీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
►ALSO READ | జోర్డాన్ టూ హైదరాబాద్..ఎయిర్ పోర్టులో మెరిసిన ఎన్టీఆర్.. ఫోటోలు వైరల్..
ముహూర్తం ఎప్పుడంటే?
అల్లు శిరీష్ తన వివాహ తేదీ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది.. మార్చి 6, 2026న ఈ జంట వివాహం జరగనుంది. ఇక్కడ విశేషమేమిటంటే, అదే రోజు అల్లు అర్జున్ – స్నేహారెడ్డిల పెళ్లి రోజు కూడా. అన్నయ్య మ్యారేజ్ డే రోజే తమ్ముడు కూడా పెళ్లి చేసుకోవడం అల్లు కుటుంబంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. గతేడాది అక్టోబర్ 31న వీరి నిశ్చితార్థం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే..
