జోర్డాన్‌‌‌‌ టూ హైదరాబాద్..ఎయిర్ పోర్టులో మెరిసిన ఎన్టీఆర్.. ఫోటోలు వైరల్..

జోర్డాన్‌‌‌‌ టూ హైదరాబాద్..ఎయిర్ పోర్టులో మెరిసిన ఎన్టీఆర్.. ఫోటోలు వైరల్..

ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్  తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘డ్రాగన్‌‌‌‌’ అనే టైటిల్‌‌‌‌ పరిశీలనలో ఉన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా  జరుగుతోంది. ప్రస్తుతం జోర్డాన్‌‌‌‌ దేశంలో కీలక  షెడ్యూల్‌‌‌‌ను  చిత్రీకరిస్తున్నారు. రెండు వారాల క్రితం ప్రారంభమైన ఈ షెడ్యూల్లో చిన్న గ్యాప్ రావడంతో ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్  వచ్చాడు.  ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్టీఆర్ కనిపించగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే మరింత లీన్ అండ్ రగ్గడ్ లుక్‌‌‌‌లో, ఒత్తైన గడ్డం, స్టైలిష్ హెయిర్ స్టైల్‌‌‌‌తో కనిపించాడు. మరో పదిహేను రోజుల పాటు జోర్డాన్‌‌‌‌లో షూటింగ్ జరగనుండగా, ఈ షెడ్యూల్‌‌‌‌లో హాలీవుడ్ స్థాయి భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌లను ప్రశాంత్ నీల్ చిత్రీకరించనున్నారు.  

ఎన్టీఆర్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 31వ చిత్రం.  రుక్మిణీ వసంత్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తుండగా, టోవినోథామస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.   మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌‌‌‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.