ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం' రాకా' . వరుస సినిమా షెడ్యూళ్లు, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల మధ్య తీరిక లేకుండా గడుపుతున్న బన్నీ.. షూటింగ్ కు కాస్త విరామం తీసుకున్నారు. తన కుటుంబంతో కలిసి ఆస్ట్రియాలోని అందమైన ఆల్ప్స్ పర్వతాల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన సతీమణి అల్లు స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో అవి క్షణాల్లో వైరల్‌గా మారాయి.
బన్నీ, స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హ కలిసి ఇన్స్‌బ్రుక్ సమీపంలోని ప్రసిద్ధ సీగ్రూబ్ టెర్రస్ (Seegrube Terrace) వద్ద సందడి చేశారు. సముద్ర మట్టానికి సుమారు 1,905 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం నుంచి కనిపించే ఆల్ప్స్ పర్వత శ్రేణులు, నగర అందాలు, కిందుగా ప్రవహించే ఇన్ నది దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.. ఆ ప్రకృతి అందాల మధ్య బన్నీ కుటుంబంతో ప్రశాంతంగా గడిపిన క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
►ALSO READ | Jana Nayagan First Review: ‘జననాయగన్’ ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే? సీఎం విజయ్ మాస్ జాతరకు థియేటర్లు సిద్ధం..
ముఖ్యంగా అల్లు అర్జున్ పిల్లలతో సరదాగా గడుపుతున్న విజువల్స్ అభిమానుల్లో మంచి స్పందన తెచ్చాయి. ఎప్పుడూ షూటింగ్‌లు, ఈవెంట్లతో బిజీగా ఉండే స్టార్ హీరో ఇలా కుటుంబంతో నాణ్యమైన సమయం గడపడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో 'ఫ్యామిలీ మ్యాన్ బన్నీ', 'వెకేషన్ మోడ్ ఆన్', 'స్టైలిష్ స్టార్‌కు ఇదే అసలు రిలాక్సేషన్' అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇక 'రాకా'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి మేకింగ్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. వెకేషన్ ముగిసిన వెంటనే అల్లు అర్జున్ తిరిగి షూటింగ్‌లో పాల్గొని, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Allu Arjun Latest ❤️
— AlluArjunFANS (@AlluArjunFFANS) July 22, 2026
For the first time since the Raaka shoot began, AA has taken a proper 2-week break from work.
He’s currently holidaying abroad (Austria, Europe) with his family and friends.
AA will return to sets in the first week of August.#Raaka #AlluArjun #RAAKA… pic.twitter.com/TbwJYjWE5o
