ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 18 వరకు ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇంటర్మిడియేట్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య మీడియాతో మాట్లాడారు. మొత్తం 9,97,075 విద్యార్థులు హాజరు కాబోతున్నారని చెప్పారు. ఇందులో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4 లక్షల 89 వేల126 మంది, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 4 లక్షల 53 వేల 932 మంది ఉన్నారని తెలిపారు.
ఇంటర్ ఎగ్జామ్స్ కు మొత్తం 1,495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పేరెంట్స్ మొబైల్స్ కు హాల్ టికెట్స్ పంపించాం. విద్యార్థులు 15 నిమిషాల ముందే ఎగ్జామ్ హాల్ లో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. 28 వేల500 మంది ఇన్విజిలేటర్స్ తో పరీక్షలు నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు.
