లక్నోలో డబుల్ డెక్కర్ బస్సు బోల్తా: నలుగురు స్పాట్ డెడ్.. 12 మందికి సీరియస్

లక్నోలో డబుల్ డెక్కర్ బస్సు బోల్తా: నలుగురు స్పాట్ డెడ్.. 12 మందికి సీరియస్

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన సోమవారం (ఫిబ్రవరి 23) మధ్యాహ్నం గోసాయి గంజ్ సమీపంలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగింది. 

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడ్డవారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై లక్నో పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. బస్సు డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బస్సు లూథియానా నుంచి బీహార్‌లోని దర్భంగాకు వెళ్తుంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సు తుక్కుతుక్కైంది.