T20 World Cup: టాస్ గెలిచిన జింబాబ్వే.. తొలుత బ్యాటింగ్ చేయనున్న వెస్టిండీస్

T20 World Cup: టాస్ గెలిచిన జింబాబ్వే.. తొలుత బ్యాటింగ్ చేయనున్న వెస్టిండీస్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. స్టేడియంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, లక్ష్య ఛేదనకు దిగడం మంచిదని జింబాబ్వే కెప్టెన్ నిర్ణయించారు. టాస్ అనంతరం జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా మాట్లాడుతూ.. ఈ వికెట్‌పై చేజింగ్ చేయడం సులభంగా ఉంటుంది.. ముఖ్యంగా మా సీమర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు.. కొత్త బంతితో తొందరగా వికెట్లు తీసే అవకాశం వారికి ఇవ్వాలని అనుకున్నామని తెలిపాడు. తుది జట్టులోకి వెలింగ్టన్ మసకడ్జా స్థానంలో రిచర్డ్ ఎన్‌గరావాని తీసుకున్నామని సికిందర్ రాజా వెల్లడించారు. 


వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ మాట్లాడుతూ.. మేము కూడా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నాం.. ఈ గ్రౌండ్‌లో మాకు మంచి రికార్డు ఉంది.. కానీ గత ఫలితాలపై కాకుండా, ఈ రోజు ఎలా ఆడతామన్నదే ముఖ్యమని అన్నారు. ఈ మ్యాచ్‌లో రొమారియో షెఫర్డ్ జట్టులోకి వచ్చాడు. చేజ్‌కు ఈసారి అవకాశం దక్కలేదన్నారు. 

జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి(w), ర్యాన్ బర్ల్, సికందర్ రజా(c), తాషింగా ముసెకివా, టోనీ మునియోంగా, డియోన్ మైయర్స్, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్, రిచర్డ్ న్గరవ, బ్లెస్సింగ్ ముజారబానీ

వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్(w/c), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షామర్ జోసెఫ్