హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్లో ట్రాఫిక్సమస్య పరిష్కరించడంతో పాటు పబ్లిక్ట్రాన్స్పోర్టేషన్ను బలోపేతం చేసేందుకు హెచ్ఎండీఏలోని ఉమ్టా మరో కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ఎంఎంటీఎస్, మెట్రో రైల్, బస్స్టేషన్లను లింక్చేయడమే ఆ ఆలోచన. ప్రయాణికులు రోడ్డుపైకి రాకుండా ఈ మూడింటిని కలుపుతూ స్కైవాక్‌లను నిర్మించాలని ప్రతిపాదించింది. దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్సమస్య కొంతవరకు తగ్గుతుందని అంటున్నారు.
బస్టాప్‌లకు దూరంలోనే..
గ్రేటర్లో 51 మెట్రో స్టేషన్లుండగా, వీటిని కొన్ని చోట్ల ఆనుకుని ఎంఎంటీఎస్స్టేషన్లున్నాయి. ప్రధానంగా సికింద్రాబాద్, బేగంపేట, నాంపల్లి, భరత్‌నగర్, మలక్‌పేట, ఖైరతాబాద్‌లో మెట్రో, ఎంఎంటీఎస్స్టేషన్లు పక్కపక్కనే ఉన్నాయి. ఈ స్టేషన్లకు ఆనుకునే బస్టాప్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీని కోసం ఆయా శాఖలు సమన్వయంతో వ్యవహరించేలా ఉమ్టా ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం గ్రేటర్లో బస్టాప్‌లకు 500 మీటర్ల దూరంలో 21 ఎంఎంటీఎస్స్టేషన్లు ఉండగా, 500 మీటర్లకు మించి కిలోమీటర్దూరంలో 12, కిలోమీటర్ఆ పై దూరంలో 18 స్టేషన్లున్నాయి. ఇందులో 500 మీటర్ల నుంచి కిలోమీటర్‌కు పైగా దూరంలో ఉన్న బస్టాప్‌లను తరలించి ఎంఎంటీఎస్స్టేషన్కు దగ్గరలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు.
వాహనాలతో 70 లక్షల మంది
ప్రయాణికుల సంఖ్య ప్రకారం చూసుకుంటే ఎంఎంటీఎస్‌లో రోజుకు 40 నుంచి 50వేల మంది జర్నీ చేస్తుండగా, మెట్రోలో రోజుకు దాదాపు 5లక్షల మంంది, ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 25 లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నట్టు అధికారుల నివేదిక వెల్లడించింది. వ్యక్తిగత వాహనాలతో రోడ్ల పైకి రోజుకు 70 లక్షల మంది వస్తున్నారు. ఎంఎంటీఎస్, మెట్రో, బస్స్టేషన్లను అనుసంధానం చేస్తే అధిక శాతం మంది ప్రజా రవాణానే వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
లింక్ కోసం స్కైవాక్లు
రోజూ పనుల కోసం నగర రోడ్లపైకి వచ్చే వారు ఎంఎంటీఎస్, మెట్రో, బస్సు ఇలా ఏది ఎక్కినా లాస్ట్డెస్టినీ వరకూ పబ్లిక్ట్రాన్స్పోర్టేషన్అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులు అనుకుంటున్నారు. ఉదాహరణకు ఎంఎంటీఎస్ఎక్కిన వ్యక్తి రోడ్డుపైకి రాకుండా నేరుగా బస్‌స్టేషన్‌లోకి వెళ్లి అక్కడి నుంచి గమ్యానికి వెళ్లేలా ఉండాలంటున్నారు. మెట్రో ఎక్కినా కిందకు దిగగానే బస్టాప్ఉండాలి. వీటితో పాటు మెట్రో, ఎంఎంటీఎస్, బస్టాప్‌లను లింక్చేయడానికి స్కైవాక్‌ల నిర్మాణానికి ప్లాన్చేస్తున్నారు.
ప్రస్తుతం సికింద్రాబాద్స్టేషన్దగ్గర ఎంఎంటీఎస్, మెట్రో, బస్టాప్‌లు పక్క పక్కనే ఉండడం వల్ల ముందుగా ఇక్కడ స్కైవాక్కట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ స్కైవాక్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు. మెట్రోరైల్సెకండ్ఫేజ్లోనూ ఎంఎంటీఎస్, బస్స్టేషన్లను కలుపుతూ మెట్రోస్టేషన్లను ఏర్పాటు చేస్తే స్కైవాక్ నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.
