పాన్- ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), బ్లాక్ బస్టర్ దర్శకుడు అట్లీ (Atlee) కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ' AA22xA6 ' (వర్కింగ్ టైటిల్). లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అల్లు అర్జున్-అట్లీ మూవీకి అదిరిపోయే ఓటీటీ డీల్ సెట్ అయినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న సినిమా ఓటీటీ రైట్స్కు ఆల్ టైమ్ రికార్డు ధర పలికినట్లు సమాచారం. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీకి ఏకంగా రూ.600 కోట్లకు ఓటీటీ డీల్ సెట్ అయినట్లు సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.600 కోట్లు ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇపుడు ఈ లేటెస్ట్ బజ్ సోషల్ మీడియానే కాదు వరల్డ్ సినీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై అట్లీ బృందంతో నెట్‌ఫ్లిక్స్ ఉన్నత స్థాయి చర్చలు జరుపుతోంది. ఇదే కనుక జరిగితే భారతీయ సినిమాలో ఇది ఒక ఆల్-టైమ్ రికార్డుగా నిలిచిపోతుంది.
ఇప్పటివరకు అత్యధిక ఓటీటీ రేట్ పలికిన సినిమాగా అల్లు అర్జున్ పుష్ఫ 2 మూవీ ఉంది. పుష్ప 2 సినిమాని నెట్‌ఫ్లిక్స్ రూ.275 కోట్లకి కొనుగోలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇపుడు ఆ రికార్డ్ మార్క్ ను అల్లు అర్జున్ మూవీనే బీట్ చేయడం విశేషం!
►ALSO READ | The RajaSaab Trailer 2.0: ‘ది రాజా సాబ్’ కొత్త ట్రైలర్ రిలీజ్.. హర్రర్ & యాక్షన్‌తో గూస్‌బంప్స్!
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణే ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే విజయ్ సేతుపతి, రష్మికా మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కళానిధిమారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూ.1000 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించనున్నారని తెలుస్తోంది. సినిమా టైటిల్, విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఖచ్చితంగా గ్లోబల్ స్థాయిలో కొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
