ఒకే మీటర్.. 30 ఇండ్లకు కనెక్షన్..  నెలకు రూ.32 వేల బిల్లు!

ఒకే మీటర్.. 30 ఇండ్లకు కనెక్షన్..  నెలకు రూ.32 వేల బిల్లు!
  • రాజేంద్రనగర్​డబుల్ ఇండ్లలో కష్టాలు

 

గండిపేట, వెలుగు: హైదరాబాద్​రాజేంద్రనగర్ లోని కిస్మత్‌‌‌‌పూర్ డివిజన్​లో డబుల్ బెడ్​రూమ్ కాలనీ వాసులు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మూడేండ్లుగా ఇక్కడ నివసిస్తున్న 30కి పైగా కుటుంబాలకు విడివిడిగా మీటర్లు కేటాయించకపోవడంతోఅందరికీ కలిపి ఒకే మీటర్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. దీనివల్ల నెలకు రూ. 30 వేల నుంచి 32 వేల వరకు భారీ విద్యుత్ బిల్లులు వస్తున్నాయని, ఒక్క ఫ్యాన్, లైట్ వాడినా వేలల్లో భారం పడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

‘పేరుకే సొంత ఇల్లు కానీ.. కడుతున్న బిల్లులు చూస్తుంటే అద్దె ఇంట్లో ఉండటమే మేలనిపిస్తోంది’ అని స్థానికులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, వారు వచ్చి ఫోటోలు తీసుకువెళ్లడం తప్ప ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ ఏర్పాటు చేయడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రతి ఇంటికి విడివిడిగా విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.