సినిమా అంటే హీరోయిన్ నటనకే పరిమితం అనే భావనను చెరిపేస్తూ, నిర్మాతలకు ఖర్చు తగ్గించే నటి అనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది డ్వాన్సింగ్ క్వీన్ శ్రీలీల. సాధారణంగా ఒక సినిమాలో హీరోయిన్ ఉన్నా, స్పెషల్ సాంగ్ కోసం మరో హీరోయిన్ అవసరం అవుతుంది. కానీ శ్రీలీల సినిమాల్లో హీరోయిన్ గా నటించడమే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో కనిపించి, నిర్మాతలకు అదనపు భారం లేకుండా చేస్తోంది. తన అద్భుతమైన నటన, డ్యాన్స్ మూవ్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోందీ బ్యూటీ..
ఇప్పటికే 'ధమాకా', 'గుంటూరు కారం' వంటి చిత్రాల్లో హీరోయిన్ పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్ ల్లోనూ మెప్పించిన శ్రీలీల, ప్రస్తుతం తమిళ్, హిందీ, తెలుగు అంటూ మూడు భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపో తోంది. ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తున్నా. స్థాయిలో సక్సెస్ మాత్రం ఇంకా పూర్తిగా దక్కలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. చివరిగా తమిళంలో వచ్చిన 'పరాశక్తి' సినిమాకు మిశ్రమ స్పందన లభించగా, కొంత విమద్యలు కూడా ఎదురయ్యాయి. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్ర చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, వాటి అప్డేట్స్ బయటకు రాకపోవడంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇదే సమయంలో తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన రెండో పాట 'ఆరా ఆఫ్ ఉస్తాద్' ఇటీవల గ్రాండ్ గా విడుదలై మంచి స్పందన తెచ్చు కుంది. భారీ బడ్జెట్, భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాతో తప్పు కుండా హిట్ తన ఖాతాలో పడుతుందనే నమ్మకాన్ని శ్రీలీల వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇటీవలే తన డాక్టర్ కోర్సును పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉంటూ అభిమానులను మరింత దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
