The RajaSaab Trailer 2.0: ‘ది రాజా సాబ్’ కొత్త ట్రైలర్ రిలీజ్.. హర్రర్ & యాక్షన్‌తో గూస్‌బంప్స్!

The RajaSaab Trailer 2.0: ‘ది రాజా సాబ్’ కొత్త ట్రైలర్ రిలీజ్.. హర్రర్ & యాక్షన్‌తో గూస్‌బంప్స్!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ అప్ కమింగ్ రిలీజ్ మూవీ మాత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ కావడంతో సినిమాపై భారీ హైప్ ఉంది. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ కొత్త రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. 

3 నిమిషాల 11 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ అదిరిపోయింది. రొమాంటిక్, కామెడీ, హారర్, ఫ్యామిలీ డ్రామా ఎలిమెంట్స్తో ఆసక్తి పెంచింది.  గతంలో తీసుకొచ్చిన ట్రైలర్‌ను మించి ఉంది. ప్రభాస్ డైలాగ్స్తో, ఆకట్టుకునే విజువల్స్తో భిన్నమైన హారర్, యాక్షన్ సన్నివేశాలతో వచ్చిన ఈ కొత్త ట్రైలర్‌‌‌‌‌‌‌‌ మరిన్ని అంచనాలు పెంచింది.

ట్రైలర్ ప్రారంభం నుంచే మిస్టీరియస్ వాతావరణంతో కథలోకి లాక్కెళ్తుంది. భయాన్ని కలిగించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, చీకటి లోకేషన్లు, ఊహించని ట్విస్టులతో హారర్ టోన్‌ను బలంగా ఎస్టాబ్లిష్ చేశారు. అదే సమయంలో ప్రభాస్‌కు సంబంధించిన పవర్‌ఫుల్ ఎంట్రీలు, యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రభాస్ ఈ సినిమాలో ఇప్పటివరకు కనిపించని కొత్త లుక్‌లో దర్శనమివ్వడం మరో హైలైట్. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆసక్తి రేకెత్తిస్తోంది. హారర్ సీన్స్‌లోని ఇంటెన్సిటీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌లో కనిపించే స్కేల్ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.

'నాన్నమ్మ నీకు ఈ ప్రపంచంలో అందరినీ మరిచిపోయే రోగం ఉన్న.. ఆయనని మాత్రం అస్సలు మరిచిపోలేవు.. ' అనే డైలాగ్ తో ఇది మనవడు, నాన్నమ్మ మధ్య జరిగే ఎమోషనల్ హార్రర్ అని తెలుస్తోంది. అందులో భాగంగా 'మన టైం స్టార్ట్ అయింది.. లవ్ యూ అని ప్రభాస్ అనగానే.. అలాగే రాజాసాబ్.. అని నాన్నమ్మ అనడంతో కథ మొదలైంది. ఆ తర్వాత ప్రభాస్ ఓ భయానక భవంతికి వెళ్లి.. నాకు నీ గురించి తెలుసుకోవాలని ఉంది.. నిన్ను చాలా మిస్ అయ్యాను.. అని తాత అనగా.. ' చిక్కినావు.. వలలో పడినావు.. మిస్ యూ 2 రాజాసాబ్ అని తాత చెప్పే డైలాగ్ ఆసక్తి రేపుతోంది. ఆ తర్వాత వచ్చే హార్రర్ సీన్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. 

ఇందులో ప్రభాస్కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీల‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌ పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 

ఇందులో ప్రభాస్కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీల‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌ పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు.