T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 255 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే కేవలం 17.4 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (9), వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (14) దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన స్టార్ బ్యాటర్ షిమ్రోన్ హెట్మయర్ (85), రోవ్‌మన్ పావెల్ (59), రూథర్‌ఫోర్డ్ ( 31*), షెపర్డ్ ( 21) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే పవర్ ప్లేలోనే కీలకమైన 3 వికెట్లను కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. తడివానాషే మరుమాని (14), టోనీ మున్యోంగా (14), బ్రియాన్ బెన్నెట్ (5) దారుణంగా విఫలమవగా, ర్యాన్ బర్ల్ (0), తషింగా ముసేకివా (0) వరుసగా బంతుల్లో డకౌట్ కాగా గ్రేమ్ క్రీమర్ (0), ముజారబానీ ఆశీస్సులు (0) ఔట్ అయ్యారు. డియోన్ మైయర్స్ (28), కెప్టెన్ సికందర్ రాజా ( 27 ) స్కోర్లు చేశారు.
చివర్లో బ్రాడ్ ఎవాన్స్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో ఒక్కరు చెలరేగి ఆడటంతో 147 పరుగులకే వెస్టిండీస్ బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటర్లు క్రీజులో నిలవలేక డకౌట్ కి క్యూ కట్టారు. విండీస్ బౌలర్లలో గుడాకేష్ మోతీ నాలుగు వికెట్లు తీసుకుని ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచాడు. అకేల్ హోసిన్ కూడా మూడు వికెట్లు తీసుకున్నాడు. మాథ్యూ ఫోర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. జాసన్ హోల్డర్ ఒక వికెట్ తీసుకున్నాడు.
