Weekend Movies: ఈ వారం థియేటర్లలో నాలుగు కొత్త సినిమాలు.. వీకెండ్ బ్లాస్ట్‌తో ఆడియన్స్కి ఫుల్ కిక్కు!

Weekend Movies: ఈ వారం థియేటర్లలో నాలుగు కొత్త సినిమాలు.. వీకెండ్ బ్లాస్ట్‌తో ఆడియన్స్కి ఫుల్ కిక్కు!

ఈ వారం (ఫిబ్రవరి 27–28) థియేటర్లలో చిన్న సినిమాల సందడి మొదలుకానుంది. తెలుగులో మూడు సినిమాలు విడుదలవుతుండగా, హిందీలో ఒక చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు శ్రీ విష్ణు నటించిన సినిమా మంచి ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మిగతా చిత్రాలు కూడా తమ తమ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సీనిమాలేంటో చూసేద్దాం.. 

విష్ణు విన్యాసం:

హీరో శ్రీవిష్ణు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'విష్ణు విన్యాసం'. శ్రీవిష్ణు సరసన 'ఆయ్' మూవీ ఫేమ్ నయన్ సారిక కథానాయికగా నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దర్శకడు యదునాథ్ మారుతీ రావు ఈ చిత్రాన్ని ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఫిబ్రవరి 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. థియేటర్లలో విష్ణు చేయబోయే విన్యాసాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శ్రీవిష్ణు గత చిత్రాలైన 'సామజవరగమన', 'ఓం భీమ్ బుష్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో ఆయన దిట్ట. ఇప్పటికే, 'విష్ణు విన్యాసం' టీజర్, పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండటం, సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది.

ది రైజ్ ఆఫ్ అశోక: 

సతీష్‌‌‌‌ నీనసాం, సప్తమి గౌడ జంటగా వినోద్‌‌‌‌.వి.దుండలే తెరకెక్కించిన చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. వర్ధన్‌‌‌‌ హరి, జైష్ణవి, సతీష్ నీనసాం నిర్మించారు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 27న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా 1970ల నాటి కుల వివక్ష, సమానత్వం కోసం పోరాటం నేపథ్యంలో సాగుతుంది. 

‘సన్ ఆఫ్’:

సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ, స్వీయ నిర్మాణంలో రూపొందించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తండ్రిపై కేసు వేసిన కొడుకు కథాంశంతో తెరకెక్కింది. వినోద్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ, ఫిబ్రవరి 27, 2026న విడుదల కానుంది. 

కేరళ స్టోరీ 2:

కామాఖ్య నారాయణ్ సింగ్ డైరెక్ట్ చేసిన కేరళ స్టోరీ2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇందులో ఉల్కా గుప్తా, ఆదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. ముగ్గురు హిందూ యువతులు ప్రేమలో పడిన తర్వాత వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అనే అంశాన్ని కథ ప్రధానంగా తెరకెక్కింది.

ఇకపోతే, కేరళలో కొంతమంది అమ్మాయిలను బలవంతంగా మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కథాంశంతో "ది కేరళ స్టోరీ పార్ట్ 1"తెరకెక్కింది. ఈ ఫస్ట్ పార్ట్ 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నప్పటికీ.. దానిపై వచ్చిన ఆరోపణలు మాత్రం తగ్గలేదు. ఇప్పుడు రెండో భాగం 'గోస్ బియాండ్'  అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. అంటే మొదటి భాగంలో చూపించిన దానికంటే మరేదో తీవ్రమైన విషయాన్ని ఇందులో చర్చించబోతున్నారని స్పష్టమవుతోంది.