పదేళ్ల సినీ ప్రయాణంలో వరుస ఫెయిల్యూర్స్, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అక్కినేని అఖిల్ (Akhil).. ఎట్టకేలకు ‘లెనిన్’ సినిమాతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. 2015లో అఖిల్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు, ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ ను చవిచూశాడు. ముఖ్యంగా 2023లో విడుదలైన ‘ఏజెంట్’ భారీ డిజాస్టర్‌గా నిలవడంతో అఖిల్ కెరీర్‌పై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, వెనక్కి తగ్గకుండా కథల ఎంపిక, నటనపై దృష్టి పెట్టిన అఖిల్.. 2026లో ‘లెనిన్’తో సాలిడ్ హిట్ అందుకుని తన సత్తా చాటుకున్నాడు. ఈ సక్సెస్ అఖిల్కి కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా, విమర్శలకు గట్టి సమాధానంగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే చిన్నప్పుడే తన నటనతో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న సిసింద్రీ సినిమా గురించిన కీలక విషయాలను పంచుకోవడంతో పాటుగా క్రేజీ అప్డేట్ అందించారు. వివరాల్లోకి వెళితే...
‘లెనిన్’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న అక్కినేని అఖిల్ తాజాగా ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన సినీ ప్రయాణంతో పాటు చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన తొలి చిత్రం ‘సిసింద్రి’ గురించి మాట్లాడుతూ, భవిష్యత్తులో ఆ సినిమాకు సీక్వెల్ చేయాలనే తన కలను అభిమానులతో పంచుకున్నారు.
నా కొడుకుతో ‘సిసింద్రి2’ చేస్తా: అఖిల్
‘లెనిన్’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న అఖిల్, తన తొలి చిత్రం ‘సిసింద్రి’ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ‘‘సిసింద్రి సినిమా నాకు ఎప్పటికీ చాలా ప్రత్యేకం. ఆ సినిమా సమయంలో నా వయసు కేవలం 8, 9 నెలలు మాత్రమే. నటన అంటే ఏమిటో కూడా తెలియని వయసులో ఆ చిత్రంలో నటించాను’’అని అఖిల్ పేర్కొన్నారు.
భార్య జైనాబ్‌తో చర్చ: ఈ విషయం గురించి ఇప్పటికే నా భార్య జైనాబ్‌తో కూడా మాట్లాడాను. భవిష్యత్తులో నాకు కుమారుడు పుడితే, అతనితో కలిసి ‘సిసింద్రి 2’ చేయాలని నా కోరిక. అయితే కుమారుడు పుడతాడా, కుమార్తె పుడతారా అనేది దేవుడి చేతుల్లో ఉంది. అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ఈ కలను నిజం చేసుకుంటాను" అని వెల్లడించారు.
నాకు కొడుకు పుడితే "సిసింద్రీ-2 " ఖచ్చితంగా తీస్తాను
— AVM (@AvmNews7) July 24, 2026
నా wife తో కూడా ముందే చెప్పేశాను
-- akhil Akkineni https://t.co/qk3lQFBSe6 pic.twitter.com/P0E9VE1SMY
‘సిసింద్రి’ షూటింగ్ విశేషాలు:
ఇంకా మాట్లాడుతూ, ‘సిసింద్రి’ షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా అఖిల్ గుర్తు చేసుకున్నారు. ‘‘తాను రోజుకు కేవలం నాలుగు గంటలే మేల్కొని ఉండేవాడినని, ఆ సమయంలోనే చిత్రబృందం సన్నివేశాలను చిత్రీకరించేదని చెప్పారు. తాను నవ్వే సన్నివేశాల కోసం తండ్రి నాగార్జున కెమెరా వెనుక సరదాగా ఆటపట్టించేవారని, ఏడుపు సన్నివేశాల కోసం తల్లి అమల కారులో వెళ్లిపోతే తనకు సహజంగానే ఏడుపు వచ్చేదని తెలిపారు.
►ALSO READ | OTT Thriller Review: కమర్షియల్ టచ్‌తో ఓటీటీలో సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్.. సస్పెన్స్ లవర్స్కు ఫుల్ మీల్స్ పక్కా!
ఆ సహజమైన భావోద్వేగాలనే సినిమాలో ఉపయోగించారని’’ అఖిల్ చెప్పుకొచ్చారు. అలాగే, ‘సిసింద్రి’ సినిమా తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని, ఆ సినిమా విజయం వల్లే తన తల్లి అమల బ్లూ క్రాస్ జంతు సంక్షేమ సంస్థను ప్రారంభించగలిగారని, అదే చిత్రం తనకు తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందించిందని అఖిల్ వెల్లడించారు.
