T20 World Cup: చెలరేగిన విండీస్ బౌలర్లు.. 0, 0, 0, 0 చేతులెత్తిసిన జింబాబ్వే.. ఏకంగా నలుగురా..?

T20 World Cup: చెలరేగిన విండీస్ బౌలర్లు.. 0, 0, 0, 0 చేతులెత్తిసిన జింబాబ్వే.. ఏకంగా నలుగురా..?

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 255 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే కేవలం 17.4  ఓవర్లలోనే ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే పవర్ ప్లేలోనే కీలకమైన 3 వికెట్లను కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అయితే జింబాబ్వే జట్టులోని నలుగురు ఆటగాళ్లు గ్రేమ్ క్రీమర్ (0), ముజారబానీ ఆశీస్సులు (0), ర్యాన్ బర్ల్ (0), తషింగా ముసేకివా (0) కేవలం సున్నా పరుగులకే ఔట్ అయ్యారు. ఒక్కసారిగా నలుగురు ప్లేయర్స్ అవుట్ కావడంతో జింబాబ్వే ఓడిపోయింది.

తడివానాషే మరుమాని (14), టోనీ మున్యోంగా (14), బ్రియాన్ బెన్నెట్ (5) విఫలమైన.. డియోన్ మైయర్స్ (28), కెప్టెన్ సికందర్ రాజా ( 27 ) ఫర్వాలేదనిపించగా, చివర్లో బ్రాడ్ ఎవాన్స్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో  ఒక్కరు చెలరేగి ఆడాడు. దీంతో వెస్టిండీస్ బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటర్లు క్రీజులో నిలవలేక డకౌట్ కి క్యూ కట్టారు. విండీస్ బౌలర్లలో గుడాకేష్ మోతీ నాలుగు వికెట్లు తీసుకుని ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచాడు. అకేల్ హోసిన్ కూడా మూడు వికెట్లు తీసుకున్నాడు. మాథ్యూ ఫోర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. జాసన్ హోల్డర్ ఒక వికెట్ తీసుకున్నాడు.