హైదరాబాద్: అర్కాలా రియల్టీ ఇన్ఫ్రా సంస్థకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా(TG-RERA) భారీగా జరిమానా విధించింది. రెరాలో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చినందుకు 22 లక్షల 41 వేల రూపాయల జరిమానా విధించింది. తుక్కుగూడలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 వద్ద ఓ కొత్త ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, అందులోని సదుపాయాలను చూపిస్తూ సోషల్ మీడియాలో సదరు సంస్థ ప్రకటనలు ఇచ్చింది.
రెరాలో రిజిస్ట్రేషన్ కాని ప్రాజెక్టుకు సోషల్ మీడియాలో ప్రకటనలుస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్న కారణంగా అర్కాల రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా సంస్థకు జరిమానా విధించడం గమనార్హం. రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకునేంతవరకు ఎలాంటి ప్రకటనలు చేయొద్దని రెరా హెచ్చరించింది. రెరా రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థల నుంచే ఓపెన్ ప్లాట్స్ కానీ.. ఇండ్లు కానీ కొనుగోలు చేయాలని ప్రజలకు రెరా సూచించింది.
