గోవిందా... ఏంటీ ఘోరం..! : తిరుమల క్యూ లైన్ లో భక్తురాలిని కాటేసిన పాము..

గోవిందా... ఏంటీ ఘోరం..! : తిరుమల క్యూ లైన్ లో భక్తురాలిని కాటేసిన పాము..

కలియుగ వైకుంఠం తిరుమలలో కలకలం రేగింది. దర్శనం క్యూ లైన్లో ఓ భక్తురాలిని పాము కాటెయ్యడంతో హైటెన్షన్ నెలకొంది. ఆదివారం ( ఫిబ్రవరి 22 ) రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తిరుమలలోని రూ. 300 దర్శనం క్యూ లైన్లో మహిళను కాటేసింది పాము. దీంతో, ఆమెను స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ప్రస్తుతం సదరు మహిళా భక్తురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని... చికిత్స అనంతరం కోలుకున్న భక్తురాలు ఆమె స్వస్థలానికి తిరిగి వెళ్లిందని తెలిపారు అధికారులు. బాధితురాలిని తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన 27ఏళ్ళ మౌనికగా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా... తిరుమలలో క్యూ లైన్లో పాము కనిపించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఒక పక్క తిరుమల కల్తీ నెయ్యి వివాదం ముదురుతుండటం, తిరుమల పవిత్రతకు భంగం కలిగించే ఘటనలు తరచూ జరుగుతున్న క్రమంలో శ్రీవారి భక్తుల్లో భయాందోళన నెలకొంది.