ఈ20 పెట్రోల్ వలన మైలేజీ తగ్గుతుందని ఎట్టకేలకు కేంద్ర రావాణా మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు. గురువారం (జులై 30) పార్లమెంటులో 20 శాతం ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) కలిగినవాహనాల మైలేజీని 2 నుంచి 6 శాతం వరకు తగ్గించవచ్చని అన్నారు. అయితే, E20 పెట్రోల్ వల్ల ఇంజిన్ ఫెయిల్యూర్లు అవుతున్నాయనే వార్తల్లో నిజం లేదని అన్నారు. ఆ విషయం పరీక్షల్లో నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు.
ఈ 20 పెట్రోల్ పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. లోక్‌సభ, రాజ్యసభలో వివిధ ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు ఇచ్చారు మంత్రి గడ్కరీ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (SIAM), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL)లు కలిసి నిర్వహించిన అధ్యయనాల్లో E20 ఇంధనం వాహనాలకు సురక్షితమని తేలిందని చెప్పారు.
వెహికల్ మోడల్, కొన్న తేదీ ఆధారంగా మైలేజీ 2-6 శాతం తగ్గవచ్చు.
ఇంజిన్ డ్యూరబిలిటీ, రోడ్ టెస్టుల్లో E20 వల్ల ఎలాంటి ఫెయిల్యూర్లు లేవు.
E20తో బెటర్ యాక్సిలరేషన్, మెరుగైన రైడ్ క్వాలిటీ, E10 కంటే సుమారు 30 శాతం తక్కువ కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి.
2016 ముందు తయారైన కొన్ని BS-III వాహనాల్లో రబ్బర్ పార్ట్స్, గాస్కెట్లు మార్చాల్సి రావచ్చు. ఇవి సాధారణ సర్వీసింగ్‌లోనే సులభంగా చేయవచ్చు.
►ALSO READ | యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
పాత వాహనాల్లో ఇంజిన్ మార్పులు అవసరం లేదని, పనితీరు లేదా వేర్ అండ్ టియర్‌లో మార్పులు లేవని అధ్యయనాలు చెబుతున్నాయని గడ్కరీ తెలిపారు. డ్రైవబిలిటీ, స్టార్టబిలిటీ, మెటల్-ప్లాస్టిక్ కాంపాటబిలిటీల్లో సమస్యలు లేవని స్పష్టం చేశారు.
E20 ఇంధనం (80 శాతం పెట్రోల్ + 20 శాతం ఎథనాల్) ప్రవేశపెట్టడంపై విపక్షాలు, వినియోగదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై గడ్కరీ సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వం శాస్త్రీయంగా, దశలవారీగా ఈ ప్రక్రియను అమలు చేస్తోందని, ఆటోమొబైల్ తయారీదారులు E20 వాహనాల వారంటీలను గౌరవిస్తున్నారని ఆయన చెప్పారు.
