ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజే విషాదం: నంద్యాల జిల్లాలో పెద్దపులి మృతి

ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజే విషాదం: నంద్యాల జిల్లాలో  పెద్దపులి మృతి

ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజే పర్యావరణ, వన్యప్రాణి ప్రేమికులను కలచివేసే విషాదకర ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగలూటి రేంజ్‌లో, మునిమడుగు ఏరు సమీపంలో వృద్ధాప్యం కారణంగా ఓ పెద్దపులి మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

మృతి చెందిన ఆ ఆడ పెద్దపులిని T66F గా అధికారులు గుర్తించారు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ - NTCA నిబంధనల మేరకు, వన్యప్రాణి వైద్యుల బృందం పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.